న్యూఢిల్లీ: మన దేశంలో తినే శనగలు ఆస్ట్రేలియా నుంచి, మసూర్ పప్పు కెనడా, ఆస్ట్రేలియా నుంచి వస్తున్నాయి. వంటనూనెల అవసరాల్లోనూ సగానికిపైగా దిగుమతులపైనే ఆధారపడుతున్నాం. దేశంలో ఆహార అవసరాలు తీర్చుకునే విషయంలో ఇంకా పూర్తి భద్రత సాధించలేదని నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ అశోక్ కుమార్ లాహిరి హెచ్చరించారు.
ఏటా 1.7 కోట్ల టన్నుల వంటనూనెలను దిగుమతి చేసుకుంటున్నామని, ఇందుకు సుమారు 20 బిలియన్ డాలర్లు ఖర్చవుతోందని తెలిపారు. పప్పు ధాన్యాల సరఫరాలో అంతరాయం ఏర్పడినా, అంతర్జాతీయంగా ధరలు పెరిగినా దేశంపై తీవ్ర ప్రభావం పడుతుందని చెప్పారు.
గోధుమలు, వరి సాగుతోపాటు పప్పు ధాన్యాలు, నూనె గింజల సాగును పెంచాలని సూచించారు. వీటికి తక్కువ నీరు అవసరమవుతుందని, దేశీయ ఉత్పత్తి పెరిగితే దిగుమతులపై ఆధారపడటం తగ్గుతుందని పేర్కొన్నారు.
