జ్యోతిష్యం: వృశ్చికరాశిలో సూర్య సంచారం.. 8 రాశుల వారికి రాజయోగంతో పాటు కనకవర్షం..!

జ్యోతిష్యం:  వృశ్చికరాశిలో సూర్య సంచారం.. 8 రాశుల వారికి రాజయోగంతో పాటు కనకవర్షం..!

నవగ్రహాలకు రారాజు సూర్యుడు ఒక రాశి నుంచి మరో రాశిలోకి ప్రవేశిస్తున్నాడు.  ప్రస్తుతం తులారాశిలో  సంచరిస్తున్న సూర్యుడు వృశ్చిక రాశిలోకి  నవంబర్​ 16 వ తేది రాత్రి 7:48 గంటలకు  ప్రవేశిస్తున్నాడు. సూర్య భగవానుడురాశిని మార్చడం వల్ల ఎనిమిది రాశుల వారికి రాజయోగంతో పాటు కనకవర్షం కురుస్తుందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.  ఇప్పుడు ఆరాశుల గురించి తెలుసుకుందాం. . .! 

వృషభ రాశి:  సూర్యుడు వృశ్చిక రాశిలోసంచారం వలన ఈ రాశి వారి జీవితంలో అద్భుతమైన మార్పులు ఉంటాయని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.  వ్యాపారస్తులు కొత్త బ్రాంచ్​లు ఓపెన్​ చేసే అవకాశం ఉంది.  ఉద్యోగస్తులకు  కొత్త ప్రాజెక్టులు వచ్చే అవకాశం ఉంది.  ఉద్యోగస్తులు ... కార్యాలయంలో కీలక పాత్ర పోషిస్తారు.  విదేశీ ప్రయాణాలు కూడా అనుకూలిస్తాయి.  గతంలో ఉన్న సమస్యలు పరిష్కారమవుతాయి.  కుటుంబసభ్యుల మధ్య ఉన్న అవాంతరాలు.. అపోహలు తొలగిపోవడంతో మనశ్శాంతి ఏర్పడుతుంది.  వ్యాపారస్తుల విషయంలో ఊహించని లాభాలు కలుగుతాయి.  పెట్టుబడికి మూడు రెట్లు లాభం కలుగుతుంది.  కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. సూర్యభగవానుడి ఆశీస్సుల వలన ఈ రాశి వారికి సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఆర్థిక పరంగా  ఊహించని లాభాలు అందుతాయి.  ప్రేమ.. పెళ్లి వ్యవహారాలు కలసి వస్తాయి. నిరుద్యోగులకు ఆశించిన జాబ్​ లభించే అవకాశం ఉంది. 

మిథున రాశి:  వృశ్చిక రాశిలోకి  సూర్యుడు రావడం ఈ రాశి వారికి గొప్పవరమని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.  కెరీర్​ విషయంలో అద్భుతమైన పురోగతిని సాధిస్తారు. ఆర్థికపరమైన ఇబ్బందులు తొలగిపోతాయి.  గతంలో రావలసిన డబ్బు ఇప్పుడు చేతికి అందుతుంది. కుటుంబసమస్యలు పరిష్కారమవుతాయి.  ఉద్యోగస్తులకు... వ్యాపారస్తులకు .. చేతి వృత్తుల వారికి ఆదాయం పెరుగుతుంది.  గతంలో పెట్టిన పెట్టుబడులకు ఇప్పుడు ఫలితం పొందుతారు.  నిరుద్యోగులకు మంచి జాబ్​ ఆఫర్​ వస్తుంది.  మీరు తీసుకునే నిర్ణయం లైఫ్​ టర్నింగ్​ పాయింట్​ అవుతుంది.  ఆర్థిక పరిస్థితి మునుపటి కంటే చాలా మెరుగ్గా మారి, ధన లాభాలు చేకూరే అవకాశాలున్నాయని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. 

కన్యా రాశి: సూర్య సంచారంలో మార్పు... వృశ్చికరాశిలోకి ప్రవేశించడం వలన ఈరాశి వారికి అన్ని విధాలుగా కలసి వస్తుంది. కెరీర్​ విషయంలో అద్భుతమైన అవకాశాలు ఉన్నాయని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.  కాంట్రాక్టులకు కొత్త ఆర్డర్లు వచ్చే అవకాశం ఉంది. నిరుద్యోగులకు మంచి జాక్​ పాక్​ తగులుతుంది.  ఊహించిన దానికంటే మంచి ఉద్యోగం వస్తుంది.  ఉద్యోగస్తులకు ప్రమోషన్​ వస్తుంది.  వ్యాపారస్తులకు ఊహించని లాభాలు కలుగుతాయి.  పెళ్లి సంబంధం విషయంలో సంప్రదింపులు కొనసాగుతాయి.  కుటుంబ సమస్యలు పరిష్కారం కావడంతో సంతోషంగా గడుపుతారు. ఆరోగ్య విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం చాలా మంచిది. వ్యక్తిగత జీవితంలో,  ప్రేమ వ్యవహారాల్లో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుందని  జ్యోతిష్యశాస్త్రం ద్వారా తెలుస్తోంది. 

తులా రాశి:  ఈ రాశివారికి సూర్యుడు వృశ్చిక రాశిలోకి అడుగుపెట్టడంతో  కష్టాలు తొలగిపోతాయి. 
చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. విద్యార్థులకు చదువుపై ఆశక్తి పెరుగుతుంది.  ప్రేమ వ్యవహారాలు బలపడతాయి.  కొత్త  ఆదాయ మార్గాలు ఏర్పడుతాయి.  ఆకస్మిక ధన లాభం రావడంతో కొత్తగా ఆస్తిని కొనుగోలు చేసే అవకాశం  ఉంది.  ఆర్థిక స్థిరత్వం ఏర్పడం... ఆస్తి వివాదాలు అనుకూలంగా పరిష్కారం అవుతాయి. రియల్ ఎస్టేట్... బ్యాంకింగ్ ...వడ్డీ వ్యాపారం ..ఆర్థిక లావాదేవీలు వంటి రంగాలలో ఉన్న వారికి ఎంతగానో కలిసి వస్తుంది.  ప్రయత్నాలు ఆలోచనలు, తప్పకుండా మంచి ఫలితాలను ఇస్తాయి. నిలిచిపోయిన పనుల వేగం పుంజుకుంటాయి. ఆర్థిక  లావా దేవీల గొడవలు  ఒక కొలిక్కి వస్తాయి

వృశ్చిక రాశి: సూర్యుడు ఇదే రాశిలో సంచరించడం వలర ఈ రాశి వారికి లక్ష్మీదేవి అనుగ్రహంలో ధనలాభం కలుగుతుంది.  పూర్వీకుల ఆస్తి కలసి వస్తుంది.  కార్యాలయంలో మీకు ఉన్నత స్థానం లభిస్తుంది.  పనిభారం పెరుగుతుంది.  ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. వ్యాపారస్తులకు పెండింగ్ పనులు   పూర్తవుతాయి. వ్యక్తిగత, వృత్తిగత జీవితంలో కొనసాగుతున్న సమస్యల నుంచి బయటపడే సూచనలు ఉన్నాయి.  ఎలాంటి ఇబ్బంది లేదు.. అంతా మంచే జరుగుతుంది. 

మకర రాశి: ఈ రాశి వారికి సూర్యుడి సంచారం ప్రభావం  చాలా అనుకూలంగా ఉంటుంది.  ఇప్పటి వరకు మిమ్ములను వ్యతిరేకించిన వారు మీ  వద్దకు వచ్చే అవకాశం ఉంది.  గతంలో ఎదురైన క్లిష్ట పరిస్థితులు తొలగిపోతాయి.   ఆర్థిక స్థితిగతులు మెరుగుపడతాయి.ఉద్యోగస్తులకు అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది.  వ్యాపారస్తులు అధికంగా లాభాలు పొందుతారు.  కుటుంబంలో ఆనందకరమైన వాతావరణం ఉంటుంది.  గతంలో రావలసిన మొండి బకాయిలు వసూలవుతాయి. ఉద్యోగ పరంగా కొన్ని సానుకూల మార్పులు జరగటానికి అవకాశం ఉంది. ఉద్యోగం మారటానికి కూడా అవకాశం ఉంటుంది. గృహ వాహన సౌఖ్యాలకు అవకాశం ఉందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. 

కుంభ రాశి: సూర్యుడు వృశ్చిక రాశిలో సంచరించడం వలన ఈ రాశి వారికి ధనలాభం కలిగే అవకాశాలున్నాయి.  కొత్తగా ఆస్తిని కొనుగోలు చేసే అవకాశం ఉంది. శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. దాంపత్య జీవితం ఆనందంగా సాగిపోతుంది. పెళ్లి సంబంధం కోసం ఎదురు చూసే వారు గుడ్​ న్యూస్​ వింటారు. ఆదాయ పరంగా ఎలాంటి ఇబ్బంది ఉండదు.  ఉద్యోగస్తులకు అనుకున్న పనులు అనున్నట్టుగా జరుగుతాయి.  వ్యాపారస్తులకు అధికంగా లాభాలు వస్తాయి.ఏ విషయంలోనూ ఆందోళన పడాల్సిన అవసరం లేదు. అంతా మంచే జరుగుతుంది.

మీన రాశి: సూర్యుడు వృశ్చికరాశిలో సంచారం వలన ఈ రాశి వారికి ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది. చేపట్టిన ప్రతి పని కూడా విజయవంతంగా పూర్తవుతుందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. చేపట్టిన పనులు ఎలాంటి ఆటంకాలు లేకుండాపూర్తవుతాయి. కెరీర్​ విషయంలో మీరు తీసుకొనే నిర్ణయం లైఫ్​ టర్నింగ్​ పాయింట్​ అవుతుంది.  వ్యాపారస్తులకు అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది.. కొత్త అవకాశాలు లభిస్తాయి. . భూమి లేదా వాహనం కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి.  ఉద్యోగస్తులకు ఎలాంటి ఇబ్బంది ఉండదని పండితులు చెబుతున్నారు. నిరుద్యోగులకు ఆశించిన జాబ్​ వస్తుంది. ప్రేమ ... పెళ్లి వ్యవహారాలు కలసివస్తాయి.

Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని జ్యోతిష్య నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించరు. మీకున్న  జ్యోతిష్య సమస్యలకు నిపుణులను సంప్రదించటం ఉత్తమం.