Tirumala: తిరుమలకు క్యూ కడుతున్న సినీ స్టార్స్.. వేకువజామునే శ్రీవారి సేవలో లావణ్య త్రిపాఠి

Tirumala: తిరుమలకు క్యూ కడుతున్న సినీ స్టార్స్.. వేకువజామునే శ్రీవారి సేవలో లావణ్య త్రిపాఠి

Tirumala: కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి దర్శనం కోసం సామాన్య భక్తులతో పాటు సినీ, రాజకీయ ప్రముఖులు సైతం తరలివస్తుంటారు. తాజాగా తిరుమల కొండపై సినీ స్టార్స్ సందడి నెలకొంది. వరుసగా పలువురు సినీ ప్రముఖులు శ్రీవారిని దర్శించుకుంటున్నారు. ఈ క్రమంలోనే సినీ నటి, మెగా కోడలు లావణ్య త్రిపాఠి శనివారం (నవంబర్ 14) వేకువజామున తిరుమలకు చేరుకుని శ్రీవారి సుప్రభాత సేవలో పాల్గొన్నారు. అనంతరం స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం తర్వాత వేద పండితులు ఆమెకు ఆశీర్వచనం అందించి, స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.

తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన లావణ్య త్రిపాఠి

2012లో అందాల రాక్షసి సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన లావణ్య త్రిపాఠి.. తొలి చిత్రంతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత భలే భలే మగాడివోయ్, సోగ్గాడే చిన్ని నాయనా, అర్జున్ సురవరం వంటి చిత్రాలతో ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు. మెగా హీరో వరుణ్ తేజ్‌ను వివాహం చేసుకున్న ఆమె.. తాజాగా తిరుమల శ్రీవారిని దర్శించుకోవడంతో వార్తల్లో నిలిచారు.

తిరుమలకు క్యూ కడుతున్న సినీ స్టార్స్..

శుక్రవారం (నవంబర్ 13) కూడా తిరుమలలో సినీ తారల సందడి నెలకొంది. టాలీవుడ్ హీరోయిన్లు శ్రీలీల, శ్రీ గౌరీ ప్రియ వేర్వేరుగా శ్రీవారిని దర్శించుకోగా.. ప్రముఖ నటుడు, దర్శకుడు, కొరియోగ్రాఫర్ ప్రభుదేవా కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి దర్శనం చేసుకున్నారు. ఆయన శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం ద్వారా మొక్కులు చెల్లించుకున్నారు. ఇలా ఒకే రోజు ముగ్గురు సినీ ప్రముఖులు తిరుమలకు రావడంతో ఆలయంలో సందడి వాతావరణం నెలకొంది.