పార్లమెంట్ ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై తెలంగాణ మంత్రి వివేక్ వెంకటస్వామి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాహుల్ ఫోన్ ట్యాపింగ్ లో వాస్తముందన్నారు. గతంలో తన ఫోన్ కూడా ట్యాప్ చేశారని అన్నారు. ఆ సమయంలో ఫోన్ కంపెనీల నుంచి చాలా మేసేజ్ లు వచ్చాయన్నారు. అలాంటి మేసేజ్ రాహుల్ కూడా వచ్చి ఉంటాయి. ఎలాంటి సందేహం లేదు. ఖచ్చితంగా రాహుల్ గాంధీ ఫోన్ ట్యాపింగ్ జరిగి ఉంటుందని మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు.
పార్లమెంట్ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ చేసిన ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలపై తెలంగాణ మంత్రి వివేక్ వెంకటస్వామి ANI తో మాట్లాడారు. రాహుల్ గాంధీ లేవనెత్తిన ఫోన్ ట్యాపింగ్ అంశంలో వాస్తవం ఉందని అన్నారు. గతంలో తెలంగాణలో టీఆర్ఎస్, బీఆర్ఎస్ ప్రభుత్వాల హయాంలో తాను ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నానని గుర్తుచేశారు. తన ఫోన్‌ను ట్యాపింగ్ చేసినట్లు, ఫోన్ నిఘాలో ఉన్నట్లు ఫేస్‌టైమ్ (FaceTime) నుంచి తరచూ మేసేజ్ లు వచ్చేవని వివేక్ వెంకటస్వామి తెలిపారు.
తన ఫోన్‌పై నిఘా కొనసాగుతున్నట్లు వచ్చిన హెచ్చరికలు ఆందోళన కలిగించాయన్నారు. రాహుల్ గాంధీకి కూడా ఫోన్ కంపెనీల నుంచి ఇలాంటి హెచ్చరిక మేసేజ్ లు వచ్చి ఉండవచ్చని అన్నారు. రాహుల్ గాంధీ ఫోన్ ట్యాపింగ్‌కు గురవుతున్నారన్న ఆరోపణల్లో ఖచ్చితంగా వాస్తవం ఉందన్నారు.
ఇటీవల రాహుల్ గాంధీ ఫోన్ ట్యాపింగ్ అంశాన్ని ప్రస్తావించడంతో తెలంగాణ రాజకీయాల్లో ఈ వ్యవహారం మరోసారి చర్చనీయాంశంగా మారింది. మంత్రి వివేక్ వెంకటస్వామి వ్యాఖ్యలతో ఈ ఆరోపణలకు రాజకీయంగా మరింత ప్రాధాన్యత సంతరించుకుంది.
#WATCH | Hyderabad, Telangana: On Rahul Gandhi's 'phone tapping' allegations, Telangana Minister Vivek Venkatswamy says, “I think Rahul ji has a very strong point. You can now find out whether your phone is being tapped. I witnessed this during the TRS and BRS regimes as well. My phone was tracked, and I used to receive regular messages from FaceTime saying that my phone was being monitored. I am sure Rahul ji has received similar messages from phone companies informing him that his phone is being tapped...”
— ANI (@ANI) November 14, 2026
