ఎన్వీడియా మాజీ సీఈఓ జెన్సన్ హువాంగ్ రాజీనామా అంశం ప్రస్తుతం టెక్ ప్రపంచంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. వ్యక్తిగత వివాదాల కారణంగా ఆయన తన పదవికి వీడ్కోలు పలకగా.. ఆయనను తిరిగి అదే స్థానంలో నియమించాలనే డిమాండ్లు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ చేసిన వ్యాఖ్యలు ఈ వివాదానికి మరింత ప్రాధాన్యతను తెచ్చి పెట్టాయి.
దాదాపు 33 సంవత్సరాల పాటు ఎన్వీడియా సంస్థను విజయవంతంగా నడిపిన జెన్సన్ హువాంగ్.. తన వ్యక్తిగత జీవితంలో అఫైర్స్ గురించి బయటపెట్టడంతో నవంబర్ 12న సీఈఓ, ప్రెసిడెంట్ పదవులకు రాజీనామా చేశారు. వివాహేతర సంబంధాల ఆరోపణలు, ముఖ్యంగా చైనాకు చెందిన ఒక వ్యాపారవేత్తతో ఉన్న సంబంధాల నేపథ్యంలో ఈ పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఈ ఆరోపణలను హువాంగ్ స్వయంగా అంగీకరిస్తూ ఉద్యోగులకు క్షమాపణలు కూడా తెలిపారు.
@yunta_tsai A petition is underway to reinstate Jensen and I’m signing it too
— Elon Musk (@elonmusk) November 13, 2026
అయితే ఆయన రాజీనామాను జీర్ణించుకోలేని ఎన్వీడియా ఉద్యోగులు కొందరు ఆయనను తిరిగి సీఈఓగా నియమించాలని కోరుతూ సంస్థ అంతర్గత ప్లాట్‌ఫారమ్‌లో పిటిషన్ దాఖలు చేశారు. హువాంగ్ చేసిన సేవలను దృష్టిలో ఉంచుకుని ఆయనకు మరో అవకాశం ఇవ్వాలని ఉద్యోగులు కోరుతున్నారు. ఈ నేపథ్యంలో సోషల్ మీడియా వేదిక ఎక్స్ వేదికగా ఎలాన్ మస్క్ స్పందిస్తూ.. "జెన్సన్ రీ అపాయింట్మెంట్ కోసం ఒక పిటిషన్ నడుస్తోంది, నేను కూడా దానిపై సంతకం చేస్తున్నాను" అంటూ మద్దతు ప్రకటించారు. అంతేకాకుండా మస్క్ ఒక యూజర్ ప్రశ్నకు సమాధానమిస్తూ.. జెన్సన్ హువాంగ్‌ను తన సంస్థలో రిక్రూట్ చేసుకోవటం తనకు దక్కే గౌరవమని పోస్ట్ చేశారు.
ప్రస్తుతం ఎన్వీడియా బోర్డు కొత్త సీఈఓ అన్వేషణలో ఒకపక్క బిజీగా ఉంది. ఆర్మ్ హోల్డింగ్స్ సీఈఓ రెనే హాస్ రేసులో ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతానికి చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ కొలెట్ క్రెస్ తాత్కాలిక సీఈఓగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. చూడాలి ఎన్వీడియా కంపెనీ ఈ పరిస్థితులను ఎలా ఎదుర్కొని ముందుకు సాగుతుందనేది.
