సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులతో రాహుల్ గాంధీ భేటీ

సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులతో రాహుల్ గాంధీ భేటీ

హైదరాబాద్: నోవోటల్లో రాహుల్ గాంధీతో సీఎం రేవంత్ రెడ్డి, -పీసీసీ చీఫ్, -మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్యే లు భేటీ అయ్యారు. టిఫిన్ చేస్తూ రాష్ట్ర నేతలతో రాహుల్ గాంధీ మాట్లాడారు. భారత్ సమ్మిట్ నిర్వహణపై అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితులపై కూడా ఆరా తీసిన్నట్లు సమాచారం.

విదేశీ ప్రతినిధులతో భేటీ అనంతరం రాహుల్ శిల్పారామం బయలుదేరనున్నారు. గిగ్ వర్కర్స్తో ర్యాలీలో పాల్గొననున్నారు. జయభేరి గార్డెన్లో గిగ్ వర్కర్స్ కోసం తీసుకొచ్చిన సంక్షేమ పథకాలను రాహుల్ గాంధీ ప్రారంభించనున్నారు.

భారత్ సమిట్ ముగింపు కార్యక్రమంలో పాల్గొనేందుకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ శుక్రవారం అర్ధరాత్రి హైదరాబాద్ చేరుకున్నారు. ఢిల్లీ నుంచి రాత్రి 11 గంటలకు బయల్దేరిన ఆయన ఒంటి గంట సమయంలో శంషాబాద్ ఎయిర్ పోర్టులో దిగారు. రాహుల్​కు సీఎం రేవంత్ రెడ్డి,  పీసీసీ అధ్యక్షుడు మహేశ్ గౌడ్, పలువురు మంత్రులు, పార్టీ నేతలు ఘనస్వాగతం పలికారు. అక్కడి నుంచి హైటెక్ సిటీ  నోవాటెల్ హోటల్ కు చేరుకున్న రాహుల్ రాత్రి అక్కడే బస చేశారు.

శిల్పారామం వద్ద ఉన్న ఇందిరాగాంధీ విగ్రహం నుంచి మీనాక్షి టవర్స్ గ్రౌండ్ వరకు గిగ్ వర్కర్లతో కలిసి భారీ ర్యాలీలో రాహుల్ పాల్గొంటారు.  అనంతరం డెలివరీ బాయ్స్, ఆటో డ్రైవర్లతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొంటారు. అక్కడే గిగ్ వర్కర్స్​పాలసీ అమలును ప్రకటిస్తారు.  ఆ వెంటనే రాష్ట్ర వ్యాప్తంగా పాలసీ అమల్లోకి వస్తుంది. అనంతరం లంచ్ విరామం కోసం తిరిగి నోవాటెల్ హోటల్ కు వెళ్తారు. సాయంత్రం 4. 30 గంటలకు హెచ్‌‌‌‌ఐసీసీలోని భారత్ సమిట్ ముగింపు కార్యక్రమంలో రాహుల్ పాల్గొని ప్రసంగిస్తారు. అక్కడి నుంచి నేరుగా శంషాబాద్ ఎయిర్‌‌‌‌‌‌‌‌పోర్టుకు చేరుకొని తిరిగి ఢిల్లీకి వెళ్తారు.