ముంబైలో వేల్స్ యువరాజు.. ఎర్త్‌షాట్ ప్రైజ్ కోసం భారత్కు వచ్చిన ప్రిన్స్ విలియం, కేట్

ముంబైలో వేల్స్ యువరాజు.. ఎర్త్‌షాట్ ప్రైజ్ కోసం భారత్కు వచ్చిన ప్రిన్స్ విలియం, కేట్

వేల్స్ యువరాజు విలియం, యువరాణి కేట్ ముంబై చేరుకున్నారు. 2026 ఎర్త్‌షాట్ ప్రైజ్ సెరెమనీ కోసం మూడు రోజుల భారత పర్యటనలో భాగంగా ముంబై వచ్చారు.  ఇండియా వచ్చినట్లు 2026 నవంబర్ 16న ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఫొటోలతో తమ రాకను అధికారికంగా ప్రకటించారు.

హైలో ముంబై, నమస్తే ముంబై.. అని క్యాప్షన్ పెట్టి రాజ దంపతులు ఒక ఫొటో కరోజెల్ పోస్ట్ చేశారు. అందులో రాజాభాయి క్లాక్ టవర్, ఓవల్ మైదాన్, నగరంలో తిరిగే కాళీ-పీలీ ఆటోరిక్షాలు, ముంబై స్కైలైన్ దృశ్యాలకు సంబంధించిన పిక్స్ ఉన్నాయి. 

బ్రిటిష్ హై కమిషన్ వెల్లడించిన వివరాల ప్రకారం.. ముంబైలో ఆరో వార్షిక   ఎర్త్‌షాట్ ప్రైజ్ సెరెమనీ  ముఖ్య కార్యక్రమంగా ఉంది.  క్లైమేట్ యాక్షన్, గ్రీన్ ఇన్నోవేషన్, సస్టైనెబిలిటీ విషయాలపై  సమావేశాలు, యువ చేంజ్‌మేకర్లతో సంభాషణలు కూడా ఈ పర్యటనలో భాగంగా ఉంటాయి. మహారాష్ట్ర పర్యటన పూర్తయిన తర్వాత  న్యూఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీని కలవనున్నారు.

పర్యటన ముందు విడుదల చేసిన ప్రకటనలో విలియం మాట్లాడుతూ  భారత్‌కు ఎర్త్‌షాట్ ప్రైజ్ తీసుకురావడం గొప్ప విషయం అని అన్నారు.  గత ఆరేళ్లలో  ఇతర దేశాలతో పోల్చితే   భారత్ నుంచే అత్యధికంగా ఎర్త్‌షాట్ ఫైనలిస్టులు, విజేతలు వచ్చారని ఆయన పేర్కొన్నారు. స్థానిక పారిశ్రామికవేత్తలు, ఆవిష్కర్తలు తయారుచేస్తున్న ఆచరణాత్మక పరిష్కారాల వల్ల భారత్ పర్యావరణ ఆవిష్కరణలో ప్రధాన కేంద్రంగా మారిందని విలియం వ్యాఖ్యానించారు.

ఎర్త్‌షాట్ ప్రైజ్ లక్ష్యం : 

అధిక సామర్థ్యం ఉన్న పర్యావరణ పరిష్కారాలను ముందుగానే గుర్తించి..  వాటిని ప్రోత్సహించడమే ముఖ్య ఉద్దేశమని  ఆయన తెలిపారు. పర్యావరణానికి యువ శాస్త్రవేత్తలు తయారు చేసిన పరిష్కారాలు ఎలా తోడ్పడుతాయో తెలుసుకోనునన్నట్లు చెప్పారు. వాటిని తయారు చేసిన  విద్యార్థులు, యువ నాయకులతో చర్చించనున్నట్లు చెప్పారు.

విలియం-కేట్ జంటగా భారత్ పర్యటన చేయడం ఇది రెండోసారి. గతంలో 2016లో పర్యటించారు.  అప్పుడు  భూటాన్‌తో పాటు భారత్‌ను సందర్శించారు. ఆ పర్యటనలో ఓవల్ మైదాన్‌లో సచిన్ టెండూల్కర్‌తో కలిసి క్రికెట్ ఆడటం ఆ సందర్శన విశేషంగా చెప్పుకున్నారు.