సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలు దక్కించుకోవడం అంత ఈజీ కాదు. అలాంటిది రితికా సింగ్‌కు వరుసగా క్రేజీ అవకాశాలు వస్తున్నాయి. గతంలో సూపర్‌స్టార్ రజినీకాంత్ నటించిన ‘వేట్టయాన్’ సినిమాలో కీలక పాత్రలో కనిపించిన ఈమె.. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి సినిమాలో స్పెషల్ సాంగ్ చేసే అవకాశం దక్కించుకున్నట్టు తెలుస్తోంది. దీంతో ఆమె పేరు మరోసారి టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.
రితికా సింగ్ ‘గురు’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. ఆ తర్వాత తమిళంలోనూ సినిమాలు చేస్తూ కెరీర్ కొనసాగించింది. రజినీకాంత్ 'వేట్టయాన్'లో నటించడం ఆమె కెరీర్‌లో మరో ముఖ్యమైన అవకాశంగా నిలిచింది. ఇప్పుడు చిరంజీవి, బాబీ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘కాకా’ సినిమాలో రితికా సింగ్ స్పెషల్ సాంగ్ చేసే మెగా ఛాన్స్ అందుకుంది. హైదరాబాద్‌లో వేసిన స్పెషల్ సెట్‌లో శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీలో ప్రస్తుతం ఈ సాంగ్ షూట్ జరుగుతోంది.
చిరంజీవి తనదైన గ్రేస్‌తో, రితికా సింగ్ ఎనర్జిటిక్ స్టెప్పులతో ఈ పాట సినిమాకు స్పెషల్ అట్రాక్షన్‌గా నిలుస్తుందని తెలుస్తోంది. ఇప్పటికే ఈ చిత్రంలో అనస్వర రాజన్, నివేదా పేతురాజ్ లాంటి హీరోయిన్స్ నటిస్తుండగా రితికా కూడా యాడ్ అవడం సినిమాకు మరింత ప్లస్ అవుతుందేమో చూడాలి. కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై వెంకట్ కె నారాయణ నిర్మిస్తున్న ఈ చిత్రం సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది.
