శబరిమల సిబ్బందికి భోజనం అందించాల్సిందే..కేరళ హైకోర్టు కీలక ఆదేశాలు

శబరిమల సిబ్బందికి భోజనం అందించాల్సిందే..కేరళ హైకోర్టు కీలక ఆదేశాలు

కొచ్చి: శబరిమల యత్రలో భాగంగా ఎరుమేలి-కాననపాథ అటవీ మార్గంలో అత్యవసర సేవలందిస్తున్న వైద్య, పంచాయతీ సిబ్బందికి భోజనం పెట్టాల్సిందేనని కేరళ హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. పోలీసు మెస్‌‌‌‌లో అందుబాటులో ఉన్న భోజన వసతిని వీరికి నిరాకరిస్తే వారి విధులకు ఆటంకం కలుగుతుందని న్యాయస్థానం అభిప్రాయపడింది. కాగా, పోలీస్ మెస్ నుంచి కేవలం పోలీసులకే ఆహారం అందించాలని ప్రభుత్వం అక్టోబర్ 15న ఉత్తర్వులు జారీచేసింది. ఈ నేపథ్యంలో టీడీబీ, అమికస్ క్యూరి కోర్టు దృష్టికి తెచ్చిన ఈ అంశం పై రాష్ట్ర ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు సూచించింది.