తమిళ, తెలుగు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు సంపాదించుకున్న హీరో శ్రీరామ్ (శ్రీకాంత్) నటిస్తున్న కొత్త సినిమా ‘ది మేజ్’. ప్రియాంక, హ్రితిక శ్రీనివాస్, కమల్ కామరాజు ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు. డాక్టర్ రవికిరణ్ గడలాయ్ దర్శకత్వంలో డాక్టర్ ఉదయ్ కె. రెడ్డి పాల్వాయి, డాక్టర్ కేఎస్ఆర్ (కరెడ్డి శ్రీధర్ రెడ్డి), డాక్టర్ భరత్ రెడ్డి గోపు, డాక్టర్ అనిరుధ్ రెడ్డి సోమ నిర్మిస్తున్నారు.
ఆదివారం ఈ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ను నిర్వహించారు. అతిథులుగా హాజరైన దర్శకుడు రాహుల్ రవీంద్రన్, నిర్మాత మధుర శ్రీధర్ రెడ్డి ట్రైలర్ చాలా ఇంటరెస్టింగ్‌గా ఉందని, సినిమా పెద్ద సక్సెస్ సాధించాలని కోరారు. ఈ సందర్భంగా హీరో శ్రీరామ్ మాట్లాడుతూ ‘ఇటీవల కాలంలో నేను చేసిన క్వాలిటీ ఫిలిం ‘ది మేజ్’. ఈ మూవీ అందర్నీ అమేజ్ చేస్తుంది’ అని అన్నాడు. ఇందులో పోషించిన ఈషా పాత్ర తన కెరీర్‌లో గొప్పగా నిలుస్తుందని హీరోయిన్ హ్రితిక శ్రీనివాస్ చెప్పింది.
ప్రేక్షకులకు సరికొత్త థ్రిల్లర్ అనుభూతిని అందించే చిత్రమిది అని ప్రియాంక చెప్పింది. దర్శకుడు డాక్టర్ రవికిరణ్ గడలాయ్ మాట్లాడుతూ ‘‘ది మేజ్’ అంటే మొక్కజొన్న కాదు.. పద్మవ్యూహం అని అర్థం. దారితెలియని అనూహ్యమైన పరిస్థితుల్లో చిక్కుకున్న ఓ వ్యక్తి వాటి నుంచి ఎలా బయటపడ్డాడనేదే ఈ సినిమా కథ. ప్రేక్షకులు ఊహించని ట్విస్టులు ఉంటాయి’ అని చెప్పాడు. కథ విన్నప్పటి కంటే స్క్రీన్‌పై చూసినప్పుడు ఎక్కువ థ్రిల్ అయ్యానని నిర్మాత డాక్టర్ ఉదయ్ కె. రెడ్డి పాల్వాయి అన్నారు. నటులు కమల్ కామరాజు, రవివర్మ సహా టీమ్ అంతా పాల్గొన్నారు.
