రౌడీ జనార్దన నుంచి బిగ్ అప్ డేట్

రౌడీ జనార్దన నుంచి బిగ్ అప్ డేట్

రీసెంట్‌‌‌‌గా ‘రణబాలి’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చిన  విజయ్ దేవరకొండ.. ప్రస్తుతం రవికిరణ్ కోలా దర్శకత్వంలో  ‘రౌడీ జనార్ధన’ సినిమాలో నటిస్తున్నాడు.  శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌‌‌‌‌‌‌‌పై దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు.  పూర్తి స్థాయి గ్రామీణ నేపథ్యంలో ఈ చిత్రాన్ని  రూపొందిస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ ఆసక్తికరమైన అప్‌‌‌‌డేట్ అందింది.  ‘రౌడీ జనార్దన’ కోసం వచ్చే వారం నుంచి ప్రత్యేకమైన యాక్షన్ షెడ్యూల్‌‌‌‌ను ప్రారంభించేందుకు టీమ్ ప్లాన్ చేస్తోంది.  

ఇప్పటికే ఓ ప్రత్యేకమైన సెట్‌‌‌‌ను కూడా సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. ఈ సెట్‌‌‌‌లో విజయ్ దేవరకొండపై కీలకమైన యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించనున్నారట. సినిమాలో వచ్చే ఫ్లాష్‌‌‌‌బ్యాక్ ఎపిసోడ్‌‌‌‌లో విజయ్ పూర్తిస్థాయి యాక్షన్ అవతారంలో కనిపించనున్నట్టు టాక్.  అంతేకాదు, సినిమాలోని యాక్షన్ సన్నివేశాలే ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయని ప్రచారం జరుగుతోంది.   ఈ చిత్రంలో సీనియర్ నటుడు రాజశేఖర్ పాత్ర  మరో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోందని తెలుస్తోంది.  

ఆయన ఇంతకుముందెన్నడూ కనిపించని కొత్త లుక్‌‌‌‌లో, విభిన్నమైన పాత్రలో ప్రేక్షకులను అలరించనున్నారట.  విజయ్ దేవరకొండకు జోడీగా కీర్తి సురేశ్ నటిస్తోంది.  మాస్ యాక్షన్, గ్రామీణ నేపథ్యం, ఆసక్తికరమైన పాత్రల కలయికతో రూపొందుతున్న  ‘రౌడీ జనార్దన’ విజయ్ దేవరకొండ కెరీర్‌‌‌‌లో మరో ప్రత్యేకమైన సినిమాగా నిలుస్తుందనే అంచనాలు ఉన్నాయి.  క్రిస్టో జేవియర్ సంగీతం అందిస్తున్నాడు. మార్చిలో  సినిమా రిలీజ్‌‌‌‌కు ప్లాన్ చేస్తున్నారు.