కొణిదెల పవన్ తేజ్ హీరోగా, పాడని కుమార్ హీరోయిన్‌గా నటిస్తున్న కొత్త చిత్రం ‘జంట’. వసుంధర ఆర్ట్స్ బ్యానర్‌పై రాజేష్ గునిశెట్టి, వీరు యాదవ్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి రాజశేఖర్ యాదవ్ దర్శకత్వం వహిస్తున్నాడు. రూరల్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే యూనిక్ లవ్ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనున్న ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్‌ను ఆదివారం లాంచ్ చేశారు. ఈ కార్యక్రమానికి టీడీపీ రాష్ట్ర కార్యదర్శి మెట్ల రమణబాబు, అమలాపురం ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు అతిథులుగా హాజరై టీమ్‌కు బెస్ట్ విషెస్ అందించారు.
ఈ సందర్భంగా పవన్ తేజ్ మాట్లాడుతూ ‘రెండేళ్లుగా ఈ ప్రాజెక్ట్‌పై పనిచేస్తున్నాం. బలమైన కథతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాం. షూటింగ్ మొత్తం అమలాపురంలోనే జరిగింది. ‘యుద్ధం రాముడితో కాదు.. రాజ్యంతో’ అనేది ఈ సినిమా క్యాప్షన్. ఇందులో మంచి ఎమోషన్స్‌తో పాటు మాస్ యాక్షన్ ఎలిమెంట్స్ కూడా ఉంటాయి’ అని చెప్పాడు. హీరోయిన్ పాడని కుమార్‌కు ఇది తొలి తెలుగు సినిమా కాగా, ఇందులో అరుణ్ పాండియన్, కల్పలత, నవీన్ నేని, అశోక్, శ్రావణ సంధ్య కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
