పృథ్వీ సాయి దండమూడి, జిషు సేన్ గుప్తా, కబీర్ దుహన్ సింగ్ ప్రధాన పాత్రల్లో నవీన్ నలమాస దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘మణిమ’. శ్రీ ఫిల్మ్స్ అండ్ ప్రొడక్షన్స్ పతాకంపై అమరేష్ చంద్ర సారంగి నిర్మిస్తున్నారు. ఆదివారం అన్నపూర్ణ స్టూడియోలో ఈ సినిమా ప్రారంభోత్సవం జరిగింది. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ముఖ్య అతిథిగా పాల్గొని ముహూర్తపు షాట్‌కు క్లాప్ కొట్టారు. దర్శకుడు భీమనేని శ్రీనివాస్ కెమెరా స్విచ్చాన్ చేశారు.
గాయకుడు వందేమాతరం శ్రీనివాస్ గౌరవం దర్శకత్వం వహించారు. పూరీ జగన్నాథ స్వామి నేపథ్యంలో మైథలాజికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నామని, ఈనెల 16 నుంచి తొలి షెడ్యూల్ ప్రారంభించనున్నట్టు దర్శకుడు తెలియజేశాడు. నిర్మాత అమరేష్ చంద్ర సారంగి మాట్లాడుతూ ‘నేను ఒరియాలో ఒక సినిమా నిర్మించాను.
ఇప్పుడు తెలుగులో కూడా ఈ సినిమాతో నిర్మాతగా పరిచయం అవుతున్నా. వచ్చే ఏడాది జూలైలో పూరీ రథయాత్ర సందర్భంగా ఈ చిత్రాన్ని తెలుగు, హిందీ, ఒరియా, బెంగాలీ భాషల్లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం’ అని అన్నారు.
