సుడిగాలి సుధీర్, దివ్యభారతి జంటగా వేదవ్యాస్ దర్శకత్వంలో చంద్రశేఖర్ రెడ్డి మొగుళ్ళ నిర్మించిన చిత్రం ‘గోట్’. ఏషియన్ సినిమాస్ సమర్పణలో నవంబరు 12న విడుదలైన ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తోందని టీమ్ తెలియజేసింది.
ఈ సందర్భంగా నిర్వహించిన ఈవెంట్‌లో హీరోయిన్ దివ్య భారతి మాట్లాడుతూ ‘ఈ మూవీని ఆడియెన్స్ థియేటర్లో చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. నా మీద అంతులేని ప్రేమను కురిపిస్తున్నారు. మేం ఈ చిత్రం కోసం పడిన కష్టం వృథా కాలేదని ఆడియెన్స్ రియాక్షన్స్ చూస్తే అర్థమైంది. ఈ రెస్పాన్స్ మాకు సంతృప్తి కలిగింది’ అని చెప్పింది.
దర్శకుడు వేద వ్యాస్ మాట్లాడుతూ ‘ఈ సక్సెస్ ప్రతి ఒక్కరికీ చెందుతుంది. బెట్టింగ్ అనేది ఫన్. కానీ లైన్ క్రాస్ చేయకూడదు. ఆ పాయింట్‌ని నేను కాస్త వినోదాత్మకంగా చెప్పే ప్రయత్నం చేశాను. ఈ సినిమాని చూసి బెట్టింగ్ ఒక్కడు ఆపినా చాలు’ అని అన్నాడు. నిర్మాత చంద్రశేఖర్ మాట్లాడుతూ ‘మంచి మెసెజ్ ఇచ్చేలా సినిమాని రూపొందించాం. ఎన్ని సవాళ్లు ఎదురైనా పట్టు వీడకుండా చివరి వరకు నిలబడి సినిమాను ఇక్కడి వరకు తీసుకొచ్చాం’ అని అన్నారు. రైటర్ నితిన్ ప్రసన్న, మాస్టర్ మురారి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
