‘స్కాలర్’ ఫస్ట్ లుక్ రిలీజ్.. డ్రగ్స్, గంజాయి వ్యసనంపై సందేశాత్మక చిత్రం  

‘స్కాలర్’ ఫస్ట్ లుక్ రిలీజ్.. డ్రగ్స్, గంజాయి వ్యసనంపై సందేశాత్మక చిత్రం  

యువతను పట్టిపీడిస్తున్న డ్రగ్స్, గంజాయి సమస్యలపై అవగాహన కల్పించే కథాంశంతో తెరకెక్కుతోన్న చిత్రం ‘స్కాలర్’.  కౌశిక్, ప్రతిభా సిన్హా జంటగా నటిస్తున్న ఈ చిత్రంలో సుధాకర్ గౌడ్, పెంచల్ రెడ్డి కీలక పాత్రలు పోషిస్తున్నారు. డాక్టర్ భీమగాని సుధాకర్ గౌడ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ యూత్‌‌‌‌ఫుల్ కమర్షియల్ సందేశాత్మక చిత్రం ఫస్ట్ లుక్‌‌‌‌ను నవంబర్ 14న చిల్డ్రన్స్ డే సందర్భంగా రిలీజ్ చేశారు.  ఈ కార్యక్రమానికి బాలకోటి రెడ్డి, చక్రవర్తి రెడ్డి, పెంచల్ రెడ్డి అతిథులుగా హాజరై పోస్టర్‌‌‌‌ను విడుదల చేశారు.

డ్రగ్స్‌‌‌‌కు బానిసలైన వారిని తిరిగి సాధారణ జీవితంలోకి తీసుకొచ్చేందుకు ఓ యువకుడు ప్రత్యేకమైన డ్రగ్‌‌‌‌ను కనిపెట్టడం, ఆ క్రమంలో అతని కుటుంబం డ్రగ్ మాఫియా బారిన పడటం, చివరకు ఆ మాఫియాపై హీరో చేసే పోరాటం నేపథ్యంలో ఈ సినిమా సాగనుందని,  స్పిరిచ్యువల్ బ్యాక్‌‌‌‌డ్రాప్‌‌‌‌లో ఉత్కంఠభరితంగా కథను తెరకెక్కిస్తున్నట్లు దర్శక నిర్మాతలు తెలియజేశారు.  ఈ సందర్భంగా టాలెంటెడ్ స్టూడెంట్స్‌‌‌‌కు  మెమెంటోలు, గోల్డ్ మెడల్స్, ప్రశంసాపత్రాలను అందజేశారు.