తెలుగు రాష్ట్రాలతో పాటు ఒడిశా,తమిళనాడులకు మరో తుపాన్ ముప్పు పొంచింది. బంగాళాఖాతంలో ఏర్పిడిన అల్పపీడనం వాయుగుండగా బలపడి తీరంవైపు దూసుకొస్తోంది.నవంబర్17 నాటికి తీవ్ర తుఫాన్ గామారి అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ఈ తుఫాన్ ప్రభావంతో ఎల్లుండి నుంచి తెలంగాణ, ఏపీ, తమిళనాడు, ఒడిశా రాష్ట్రాల్లో భారీ వర్షాలుకురిసే ఛాన్స్ ఉందని ఐఎండీ హెచ్చరిస్తోంది. వివరాల్లోకి వెళితే..
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా బలపడి, నవంబర్ 17 నాటికి అక్వాన్ తుఫాన్ తీవ్ర తుఫానుగా మారే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) తెలిపింది.ఈ తుఫాను నవంబర్ 19 లేదా 20 తేదీల్లో ఆంధ్రప్రదేశ్ ,తమిళనాడు తీరాల వైపు పయనించి తీరం దాటే అవకాశం ఉంది. తుఫాన్ ప్రభావంతో నవంబర్ 18 నుంచి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిశా, తమిళనాడు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఏపీలోని పలు ఉత్తర కోస్తా జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో, ఆరెంజ్ అలర్ట్‌లు జారీ చేసింది. తుఫాను హెచ్చరికలతో సముద్రంలో మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.
గతంలో అక్టోబర్‌లో వచ్చిన 'అర్నాబ్' తుపాను దక్షిణ జిల్లాల్లో తీవ్ర ప్రభావం చూపగా, నవంబర్ ప్రారంభంలో 'మురసు' తుపాను కారణంగా భారీ వర్షాలు కురిశాయి. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు ప్రభావిత రాష్ట్రాల ప్రభుత్వాలు ముందస్తు చర్యలు ప్రారంభించాయి. తాజా వాతావరణ పరిస్థితులతో తీర ప్రాంత ప్రజలు అధికారుల సూచనలు పాటించాలని అధికారులు కోరుతున్నారు.