వెలుగు బుక్ రివ్యూ: విజేతకు ఉండాల్సింది దృఢసంకల్పం 

వెలుగు బుక్ రివ్యూ: విజేతకు ఉండాల్సింది దృఢసంకల్పం 

ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీ కృష్ణస్వామి రాజు ఇటీవల  బాలసాహిత్యం అదేవిధంగా  ఆధ్యాత్మిక రచనలు చేస్తున్నారు. ఇప్పుడు వాటిని ‘ధర్మో రక్షతి రక్షితః’ అన్న శీర్షికతో 100 'మనోవికాస కథలను' ఒక సంపుటిగా తీసుకువచ్చారు. దీన్ని వాగ్గేయకారుడు  సారంగపాణికి అంకితం ఇవ్వడం విశేషం.  అన్నీ మనోవికాస కథలే’ అని కితాబిచ్చారు. ఈ కథల్లో ఎన్నెన్నో ప్రబోధాలు మరెన్నో మేల్కొల్పులు ఇంకెన్నో మానవీయ మూల్యాలు ఆధ్యాత్మికంగా, సామాజికంగా.. ఇలా ఒకటేమిటి బహుముఖంగా సాగిన  క్లుప్త కథనాలు ఇవి. ముందుమాట రాసిన డాక్టర్  పీవీ రంగనాయకులు  'జీవిత సత్యాల లఘు చిత్రాలు' అని పేర్కొన్నారు.

ప్రతి సమస్యకూ పరిష్కారం

చదివించే గుణం ఈ కథలకున్న ప్రత్యేక గుణం.  సామెతలు చాలా సందర్భోచితంగా ప్రయోగిస్తారు. దానివల్ల విషయ వస్తువు పాఠకుడికి మరింత సులభంగా చేరువవుతుంది. 'తిరిగితే వరి పొలం, తిరగకపోతే అడివి పొలం' అంటారు ఒకచోట. 'దానం చేయని చేయి, కాయలు కాయని చెట్టు ఒకటే' అని మరొకచోట పేర్కొంటారు.  తాళాల తయారీ అన్న కథలో  దేవుడు సమస్యలు సృష్టిస్తున్నాడని  నిష్ఠూరపడతామని నిజానికి మనం గుర్తించాల్సింది ఏమిటంటే..సమస్యలు సృష్టించిన దేవుడు వాటికి పరిష్కారాలు కూడా ఏదో ఒక రూపంలో ఏర్పాటు చేసి ఉంటాడని చెబుతూ... ఉత్త తాళాలు తయారు చేస్తారా?  తాళం చెవులు కూడా తయారు చేస్తారా? అని అడిగితే ఉత్త తాళాలు తయారు చేస్తే ఎలా? తప్పకుండా తాళం చెవులు కూడా చేస్తాం.  రెండూ చేస్తేనే మా వ్యాపారం అని బదులిస్తాడు 
ఆ వ్యాపారి.  చెప్పకనే సమస్యలు సృష్టించిన దేవుడే దానికి పరిష్కారం కూడా సూచిస్తాడని అంతర్లీనంగా పాఠకుడికి అర్థమయ్యే విషయం.  సాధారణంగా వ్యక్తిత్వ వికాస  గ్రంథాల్లో చూస్తూ ఉంటాం.  చివరిగంట అన్న కథలో మనిషిని ఆశ బతికిస్తుంది,  దురాశ నాశనం చేస్తుంది, నిరాశ చంపేస్తుంది. కాబట్టి  దేన్ని ఎక్కువగా పట్టించుకుంటే అదే మనతో కొనసాగుతుంది.   మనం ఆనందాన్నే పట్టుకుందాం' అన్న నిర్ణయాన్ని కలిగిస్తాడు రచయిత.

ఓడినవాడే విజేత

ఓడినవాడే విజేత అన్న కథలో 'ఆ యుద్ధం పేరు అహంకారం. ఆ యుద్ధంలో ఓడినవాడు ఎప్పుడూ గెలిచి తీరుతాడు. మనిషికి అహంకారం వస్తే విచక్షణా గుణం కోల్పోతాడు. అహంకారంతో యుద్ధంలో ఎదుటి వ్యక్తి ఓడినా అతడే విజేత.  ఎందుకంటే  గెలిచిన వ్యక్తి విజయం తాత్కాలికం. అహంకారం వీడితే. అది తాత్కాలికం అని అహంకారి గుర్తించలేడు. అనే వివరణ కనబడుతుంది.   సంపద, వస్తువులు నీకు శాశ్వత ఆనందాన్ని ఇవ్వవు. ఆధ్యాత్మికత ఆనందాన్ని, ప్రశాంతతను ఇస్తుంది. కాబట్టి ఆధ్యాత్మిక మార్గాన్ని అనుసరించు'అని హితవు చెబుతాడు మరొక గురువు.  ఇలా ధర్మో రక్షతి రక్షితః నూరుకథల్లో నిత్య సత్యాలు నిష్ఠూర సత్యాలు, ధార్మిక సత్యాలు, జీవిత సత్యాలు,  వ్యక్తిత్వ వికాస కీలకమైన అంశాలు ఎన్నో పాఠకుడికి శుభబోధకం చేశారు రచయిత. 

- ఆకుల మల్లేశ్వర రావు