తలపులు విప్పారిన...!
అడుగు లేని మనసు మడుగు
ఆలోచనల తెలివి రెక్కలు తొడుగు
అంతు తేలని మనసు మదుగు
అడుగు అడుగు మనసు ఎరుగు!
తలపుల తలుపులు
తెరువబోవు వట్టి పిలుపులు
కిర్రు కిర్రు లేని తలుపులు
కనిపించని తలపుల రెక్కలు!
గుండెలో కట్టుకున్న కోరికల గూడు
గుండెకు మనసు- మమతల తోడు
తలచుకున్న అంతరంగ రూపాలు
తలుపులు విప్పారిన గొప్పావిష్కరణలు!
అంతరంగ చిరు మెరుపులు
అడుగడుగుకు వెలుగులు
అప్పుడప్పుడు ఆటంకాల పిడుగులు
అధిగమించిన విజయాల గెలుపులు!
- పట్లొళ్ళ బక్కారెడ్డి
