BRS హయాంలో పేదల సొంతింటి కల నెరవేరలే: మంత్రి వివేక్

BRS హయాంలో పేదల సొంతింటి కల నెరవేరలే: మంత్రి వివేక్

హైదరాబాద్: గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పేదల సొంతింటి కల నేరవేరలేదని మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే పేదలకు ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చామని తెలిపారు. ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా 2 లక్షల ఇండ్లు ఇచ్చామని.. త్వరలో ఇంకా ఇవ్వబోతున్నామని చెప్పారు. బీఆర్ఎస్ రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టిన ఇచ్చిన మాట ప్రకారం కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగిస్తోందని తెలిపారు.

సోమవారం (నవంబర్ 16) మంత్రి వివేక్ మెదక్ జిల్లాలో పర్యటించారు. దుబ్బాకలో లబ్ధిదారులకు కొత్తగా మంజూరైన పెన్షన్ పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఏళ్ల తరబడి కొత్త పెన్షన్లు ఇవ్వలేదన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే అర్హులైన వారికి చేయూత పెన్షన్లు ఇస్తున్నామని తెలిపారు. కొత్త పెన్షన్‎లు ఇచ్చే కార్యక్రమంలో బీఆర్ఎస్ నేతలు గొడవ చేయడం కరెక్ట్ కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

వికలాంగులు, ఒంటరి మహిళలు  పెన్షన్‎ల కోసం ఎదురుచూస్తున్నారని.. అందరికీ పెన్షన్లు మంజూరు చేయనున్నట్లు చెప్పారు. నాలుగు లక్షల పెన్షన్లు ప్రకటించడం జరిగిందని.. 3 వేల  కోట్ల రూపాయలతో  అందరికీ పెన్షన్‎లు ఇస్తున్నట్లు తెలిపారు. మహిళలకు ఫ్రీ బస్ ప్రయాణం కల్పిస్తున్నామన్నారు. దుబ్బాక నియోజకవర్గంలో అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వడంతో పాటు ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మిస్తున్నామని చెప్పారు. పేదలకు 200 యూనిట్ల ఫ్రీ కరెంట్, సన్న బియ్యం ఇస్తున్నామన్నారు.

ALSO READ : రూ.3 వేల కోట్లతో 4 లక్షల పెన్షన్లు..

46 వేలకోట్ల రూపాయలు బకాయిలు చెల్లించడానికి ప్రభుత్వం ప్రయత్నం కృషి చేస్తోందన్నారు.  కాంగ్రెస్ పార్టీ మాట ఇచ్చినా ప్రకారం, ఎల్నినో ఉన్నప్పటికీ కూడా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు కొనసాగుతున్నాయని అన్నారు.  నవంబర్19న ముఖ్యమంత్రి సిద్ధిపేటకు వస్తున్నారని తెలిపారు. ఎల్ నినో పరిస్థితుల్లో వరి పండిస్తే నీళ్లు లేక ఇబ్బందులు ఎదురవుతాయని రైతులకు సూచించారు. ఆరు తడి పంటలు, కూరగయాలు సాగు చేయాలని సూచించారు.