మంత్రి, సీఎం విజయ్ క్లోజ్ ఫ్రెండ్ అధవ్ అర్జున విడాకులు

మంత్రి, సీఎం విజయ్ క్లోజ్ ఫ్రెండ్ అధవ్ అర్జున విడాకులు

తమిళనాడు రాజకీయాల్లో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. ముఖ్యమంత్రి విజయ్ స్నేహితుడు,  టీవీకే ప్రభుత్వ మంత్రి ఆధవ్ అర్జున విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. తన భార్య డైసీ మార్టిన్ తో పరస్పర అంగీకారంతో విడిపోవాలని నిర్ణయించుకున్నారు. దీంతో14 ఏళ్ల  వీరి వైవాహిక బంధానికి తెరపడినట్టయింది.

ఇద్దరం విడిపోవాలని డిసైడైనట్లు  డైసీ మార్టిన తన ఇన్ స్టాగ్రామ్ లో 2026 నవంబర్ 16న పోస్ట్  పెట్టారు. ఇద్దరూ పరస్పర అంగీకారంతోనే విడిపోవాలని నిర్ణయించుకున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ నిర్ణయం తమ జీవితాల్లో ఒక కొత్త అధ్యాయానికి నాంది పలుకుతుందని పేర్కొన్నారు.  తాము విడిపోయినప్పటికీ.. ఒకరిపట్ల ఒకరికి ఎప్పటికీ గౌరవం ఉంటుందని ఆమె స్పష్టం చేశారు. 14 సంవత్సరాలుగా స్నేహితులుగా, జీవిత భాగస్వామ్యులుగా, తల్లిదండ్రులుగా కలిసి సాగించిన ప్రయాణంలో ఎంతో ప్రేమ, అవగాహన, ఎత్తుపల్లాలను చూశామని పేర్కొన్నారు.

విడిపోవాలనే తమ నిర్ణయం వెనుక ఎవరి ప్రమేయం లేదని  ఇన్ స్టా పోస్టులో డైసీ పేర్కొన్నారు. కుటుంబ పరిస్థితులు కూడా కారణం కాదని అన్నారు. తమ పిల్లల భవిష్యత్తు, సంక్షేమం, సంతోషమే తమకు అత్యంత ప్రాధాన్యమని వెల్లడించారు. తల్లిదండ్రులుగా తమ బాధ్యతలను నెరవేరుస్తామని స్పష్టం చేశారు.

వేర్వేరుగా ఉన్నప్పటికీ.. ఆధవ్ అర్జున్ పట్ల తనకు ఎప్పటికీ గౌరవం తగ్గదని అన్నారు. ఆయన ఎంచుకునే ప్రతి మార్గంలోనూ సంతోషం, మనశ్శాంతి, విజయం లభించాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నానని అన్నారు. ఈ సమయంలో తమ పరిస్థితిని అర్థం చేసుకుని, కుటుంబానికి అవసరమైన ప్రైవసీని ఇవ్వాలని, అభిమానులు, మీడియా సంయమనంతో వ్యవహరించాలని ఆమె కోరారు.

ఆధవ్ అర్జున:

ఆధవ్ అర్జున.. అధికార టీవీకేలో నంబర్ 2 గా వ్యవహరిస్తోన్నారు. విజయ్ కు కుడిభుజంగా ఆయనకు గుర్తింపు ఉంది. టీవీకే ప్రభుత్వంలో పబ్లిక్ వర్క్స్, క్రీడాభివృద్ధి శాఖ మంత్రిగా కొనసాగుతున్నారు.  ఈ ఏడాది మే లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో విల్లివాక్కం నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా ఘన విజయం సాధించారు. 

డైసీ మార్టిన్:

ప్రముఖ వ్యాపారవేత్త లాటరీ కింగ్ గా ప్రసిద్ధి చెందిన శాంటియాగో మార్టిన్ కుమార్తె డైసీ మార్టిన్. 2012 నవంబర్ లో ఆయన డైసీ మార్టిన్, ఆధవ్ అర్జున వివాహం చేసుకున్నారు.  ప్రస్తుతం ఏరీస్ ఇన్‌వెస్ట్‌మెంట్స్ సంస్థకు మేనేజింగ్ డైరెక్టర్‌గా డైసీ బాధ్యతలు నిర్వహిస్తున్నారు.