సిద్దిపేట రూరల్: కాలేజీ ప్రిన్సిపల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పై పోక్సో కేసు

సిద్దిపేట రూరల్: కాలేజీ ప్రిన్సిపల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పై పోక్సో కేసు

సిద్దిపేట రూరల్, వెలుగు: విద్యార్థినులను లైంగికంగా వేధించిన ఆరోపణలపై ప్రభుత్వ కాలేజీ ప్రిన్సిపల్ పై పోక్సో కేసు నమోదైంది. సిద్దిపేట జిల్లాలోని ఓ ప్రభుత్వ కాలేజీ ప్రిన్సిపాల్ రాజేందర్ నెల రోజులుగా ఫస్ట్ ఇయర్ విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తిస్తూ, లైంగిక వేధింపులకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు వచ్చాయి. సెలవుల్లో ఇంటికి వెళ్తే మొబైల్స్​కు అసభ్యకరమైన మెసేజ్ లు పంపుతున్నారని బాధితులు తల్లిదండ్రుల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో విద్యార్థినుల తల్లిదండ్రులు యూనివర్సిటీ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. 

ఈ ఫిర్యాదుపై స్పందించిన ఆఫీసర్లు ముగ్గురు ప్రొఫెసర్లతో విచారణ కమిటీని ఏర్పాటు చేసి, సమగ్ర విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. ఈ క్రమంలో ఈనెల 13న కమిటీ సభ్యులు కాలేజీకి వెళ్లి విచారణ చేపట్టారు. బాధిత విద్యార్థినుల నుంచి రాతపూర్వకంగా ఫిర్యాదులు స్వీకరించడంతోపాటు, ప్రిన్సిపల్ వివరణ కూడా తీసుకుని యూనివర్సిటీ ఉన్నతాధికారులకు అందించినట్లు సమాచారం. కాగా, తమను లైంగికంగా వేధించినట్టు విద్యార్థినులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ప్రిన్సిపాల్ రాజేందర్ పై పోక్సో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.