పద్మారావు నగర్, వెలుగు: పద్మారావు నగర్లోని శ్రీ స్కందగిరి సుబ్రహ్మణ్య స్వామి దేవాలయంలో ఆదివారం పాల కావడి ఉత్సవాలు వైభవంగా నిర్వహించారు. వేకువజాము నుంచే నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలివచ్చి ఈ వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు.
పాల కలశాలతో కూడిన కావడులను భుజాన ఎత్తుకున్న భక్తులు ఆలయ ప్రాంగణంలో ప్రదక్షిణలు చేసి, శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారికి పాలాభిషేకం నిర్వహించారు.
