నారాయణగూడ, వెలుగు : గోసంరక్షణ మతపరమైన అంశం మాత్రమే కాదని, అది సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక, పర్యావరణ పరిరక్షణతో ముడిపడిన బాధ్యత అని గవర్నర్ శివప్రతాప్ శుక్లా అన్నారు. నారాయణగూడ సర్ధార్‌పటేల్ ఆడిటోరియంలో సనాతన గో సంపత్తి ఫౌండేషన్, గోసేవ విభాగం తెలంగాణ సంయుక్త ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి గోవిజ్ఞాన పరీక్షల బహుమతుల ప్రదానోత్సవ కార్యక్రమం నిర్వహించారు. దీనికి గవర్నర్ ముఖ్య అతిథిగా హాజరై ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు పురస్కారాలు అందజేశారు.
గవర్నర్మాట్లాడుతూ స్కూల్స్, కాలేజీల్లో గో ఆధారిత ప్రకృతి వ్యవసాయం, పశు సంక్షేమం, గ్రామీణ పారిశ్రామికతపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్, తెలంగాణ ప్రాంత సంఘచాలక్ బి. సుందర్‌రెడ్డి, అఖిల భారత గోసేవ సంయోజక్ అజిత్ ప్రసాద్ మహాపాత్ర, కార్యక్రమ అధ్యక్షుడు డాక్టర్ గుమ్మడవెల్లి శ్రీనివాస్ పాల్గొన్నారు.
గోవిజ్ఞాన పరీక్షల విజేతలకు పురస్కారాలు అందజేసిన గవర్నర్ శివప్రతాప్ శుక్లా.
