సంఖ్యా శాస్త్ర నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం ఏ నెలలో అయినా 1, 10, 19, 28 తేదీల్లో జన్మించిన వారి మూల సంఖ్య 1 అవుతుంది. అలాగే 8, 17, 26 తేదీల్లో జన్మించిన వారి మూల సంఖ్య 8 అవుతుంది. ఈ రెండు మూల సంఖ్యలు కలిగిన వారు చాలా మొండిగా, అత్యంత పట్టుదల కలిగి ఉంటారు. వారి గురించి వివరంగా తెలుసుకుందాం...!
సంఖ్యా శాస్త్రంలో ప్రతి వ్యక్తి పుట్టిన తేదీకి ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. దీన్నే మూల సంఖ్య అంటారు. న్యూమరాలజీ ప్రకారం ఒక వ్యక్తి స్వభావం, భవిష్యత్తు, బలాలు, బలహీనతలను ఈ మూల సంఖ్య ద్వారా నిర్ణయిస్తారు. న్యూమరాలజిస్ట్‌లు తెలిపిన వివరాల ప్రకారం ఈ తేదీల్లో పుట్టిన వారు చాలా మొండిగా .. పట్టుదలతో వ్యవహరిస్తారు..
1, 10, 19, 28 తేదీల్లో జననం.. మూల సంఖ్య 1
ఈ తేదీల్లో జన్మించిన వారికి మూల సంఖ్య 1 అవుతుంది. సంఖ్యా శాస్త్రం ప్రకారం ఈ మూల సంఖ్యకు అధిపతి సూర్యుడు. అందుకే వీరిలో సహజంగానే ఎంతో శక్తి ఉంటుంది.ఏ నెలలో అయినా 1, 10, 19, 28 తేదీల్లో పుట్టిన వారు లీడర్‌షిప్ క్వాలిటీస్ కలిగి ఉంటారు. ఆత్మవిశ్వాసం, స్వతంత్ర ఆలోచన వీరి ప్రధాన బలం. ఎవరి కింద పనిచేయడానికి అస్సలు ఇష్టపడరు. సొంతంగా నిర్ణయాలు తీసుకోవడం, సొంత వ్యాపారం చేయడం లేదా పెద్ద పదవుల్లో ఉండటం వీరికి ఇష్టంగా కలిగి ఉంటారు.
మొండితనం ఎలా ఉంటుంది
ఈ తేదీల్లో జన్మించిన వారు ఒక నిర్ణయం తీసుకుంటే ఎట్టి పరిస్థితిలోనూ ఆ నిర్ణయాన్ని మార్చుకోరు. వీరి ఆత్మవిశ్వాసమే కొన్నిసార్లు మొండితనంగా మారుతుంది. వాళ్లు చెప్పిందే కరెక్ట్.. వాళ్లు చేసిందే రైట్ అనే ధోరణి వీరిలో ఎక్కువగా ఉంటుంది. ఇతరుల సలహాలను ఎట్టి పరిస్థితిలోనూ వినరు. అయితే వీరి పట్టుదల వల్లే జీవితంలో పెద్ద విజయాలు సాధిస్తారని సంఖ్యా శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.
►ALSO READ | కార్తీకమాసం: నవంబర్17న గో పూజ..33 కోట్ల దేవతల ఆశీస్సులు.. ఏం చేయాలంటే..!
8, 17, 26 తేదీల్లో జననం.. మూల సంఖ్య 8
ఏ నెలలో అయినా ఈ తేదీల్లో జన్మించిన వారి మూల సంఖ్య 8 అవుతుంది. ఈ మూల సంఖ్యకు అధిపతి శని. కర్మ యోగం విషయంలో శని కీలక పాత్ర పోషిస్తాడు.సంఖ్యాశాస్త్రం ప్రకారం 8, 17, 26 తేదీల్లో పుట్టిన వారు నిజమైన కష్టజీవులు, పట్టు వదలని విక్రమార్కులుగా ఉంటారు. డబ్బు, వ్యాపారం, న్యాయం విషయాల్లో ఏ మాత్రం రాజీపడరు. చాలా సైలెంట్‌గా ఉంటూ వారి పని వారు చేసుకుంటూ పోతారు. బ్యాంకింగ్, లా, వ్యాపార రంగాల్లో కోటీశ్వరులు అయ్యే అవకాశం ఉందని న్యూమరాలజిస్ట్‌లు చెబుతున్నారు.
మొండితనం ఎలా ఉంటుంది
శని ప్రభావం వల్ల వీరు చాలా సీరియస్‌గా ఉంటారు. నమ్మిన వారి చేతిని ఎట్టి పరిస్థితిలోనూ వదిలిపెట్టరు. ఎవరు ఎంత చెప్పినా వినరు. వీరు అంత సులభంగా ఎవరినీ నమ్మరు. ఒకసారి నమ్మకం పోతే మళ్లీ కలవడం చాలా కష్టం. కోపాన్ని లోపలే దాచుకుని, తమ నిర్ణయానికే కట్టుబడి ఉంటారు. ఇది బయటి వారికి మొండితనంలా కనిపిస్తుంది.
Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని జ్యోతిష్య నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించరు. మీకున్న జ్యోతిష్య సమస్యలకు నిపుణులను సంప్రదించటం ఉత్తమం.
