స్ట్రెస్ తగ్గించే విటమిన్ B6.. వీటిలో ఎక్కువగా ఉంటుంది..! రోజూ తినండి..!

స్ట్రెస్ తగ్గించే విటమిన్ B6.. వీటిలో ఎక్కువగా ఉంటుంది..! రోజూ తినండి..!

మూడ్స్ ని కంట్రోల్ చేయడంలో, మానసిక ఒత్తిడికి లోనవ్వకుండా చూడడంలో విటమిన్ బి6 (పైరిడాక్సిన్) బాగా పనిచేస్తుంది. అంతేకాదు శరీరం ప్రోటీన్లని గ్రహించడంలో కూడా సాయపడుతుంది. విటమిన్ బి6 లోపం ఏర్పడకుండా ఏమేం తినాలంటే..

  • విటమిన్ బి6 క్యారెట్లలో ఎక్కువగా ఉంటుంది. శరీరానికి అవసరమైన ఫైబర్ తోపాటు కళ్లని ఆరోగ్యంగా ఉంచే విటమిన్-ఎ కూడా క్యారెట్లలో దొరుకుతుంది.
  • విటమిన్ బి6 కోసమే కాకుండా బరువు తగ్గాలి అనుకునేవాళ్లు రోజుకొక అరటిపండు తినాలి. వీటిలోని యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్ హెల్కు మంచివి.
  • పాలకూరలో విటమిన్ బి6తో పాటు ఐరన్, ఫోలేట్, పొటాషియం వంటి న్యూట్రియెంట్స్ ఉంటాయి. చలికాలంలో పాలకూర రెగ్యులర్గా తింటే ఆరోగ్యం కూడా బాగుంటుంది.
  • చలికాలంలో గుడ్లు తింటే ఒళ్లంతా వెచ్చగా ఉంటుంది. బ్రేక్ ఫాస్ట్ లో ఆమ్లెట్ లేదా ఉడకబెట్టిన గుడ్లు తింటే విటమిన్ బి6 లోపం ఏర్పడదు.
  • పచ్చి బఠాణీల్లో విటమిన్ బి6 ఎక్కువ. వీటిని సలాడ్స్ లేదా సైడ్ డిష్ గా క్యారెట్లు, ఆలుగడ్డలతో కలిపి తినొచ్చు కూడా.
  • క్యాలీఫ్లవర్, పొద్దుతిరుగుడు గింజల నూనె, వాల్నట్స్, అవకాడోలో విటమిన్బి6 పుష్కలంగా
  • ఉంటుంది. వీటిని తినడం వల్ల శరీరంలో హార్మోన్లు కూడా బ్యాలెన్స్ అవుతాయి.
  • టొమాటోలో విటమిన్ బీ 6 ఎక్కువగా ఉంటుంది. ఇవి చర్మాన్ని తాజాగా, ఆరోగ్యంగా ఉంచుతాయి కూడా. అలాగే టొమాటోలో ఉండే లైకోపిన్ అనే యాంటీ ఆక్సిడెంట్ చర్మాన్ని మెరిసేలా చేస్తుంది.
  • అతి తక్కువ కేలరీలుండే కీరదోసలో విటమిన్ బి6 పుష్కలంగా ఉంటుంది. దీనివల్ల డీ హైడ్రేషన్ దరిచేరదు. మెటబాలిజంకి కూడా ఎలాంటి ఇబ్బంది కలగదు. ఒబెసిటీ నుంచి బయటపడొచ్చు.
  • బీన్సిని రెగ్యులర్ గా తింటే బి6 లోపం దరిచేరదు. అలాగే వీటిల్లోని జింక్, కాపర్, మాంగనీస్, సెలీనియం. విటమిన్-ఇ, కెలు షుగర్ లెవల్స్ ని కంట్రోల్ చేసి మూడ్ స్వింగ్స్ బ్రేక్ వేస్తాయి..
  • శెనగలు, చేపల్ని డైట్ లో చేర్చినా బి.6.లోపం నుంచి తప్పించుకోవచ్చు.
  • పుదీనాని జ్యూస్ లేదా ఏదైనా కూరల్లో వేసుకుని తింటే బి6 లోపం రాదు. అలాగే పుదీనా తినడం వల్ల విటమిన్-సి. విటమిన్-ఇ, విటమిన్-కె వంటి విటమిన్లు, క్యాల్షియం కూడా శరీరానికి అందుతాయి.
  • స్వీట్ పొటాటో, కార్న్లోనూ విటమిన్ బి6 ఎక్కువగా ఉంటుంది.
  • రోజూ పాలు తాగితే కూడా విటమిన్ బి6 తగ్గకుండా చూసుకోవచ్చు..
  • అలాగే చికెన్ లివర్ తిన్నా విటమిన్ బి6 తో. పాటు ఫోలేట్, ఐరన్ వంటివి దొరుకుతాయి.