హాలీవుడ్ నటుడు రాబర్ట్ పాటిన్సన్‌ను జేమ్స్ బాండ్ పాత్రకు ఎంపిక చేసినట్లు Amazon MGM Studios అధికారికంగా ప్రకటించింది. కొత్త బాండ్ చిత్రాన్ని దర్శకుడు డెనిస్ విలెన్యూవ్ తెరకెక్కిస్తుండగా... స్టీవెన్ నైట్ స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. యామీ పాస్కల్, డేవిడ్ హేమాన్ ఈ సినిమాకు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారని తెలిపింది అమెజాన్ ఎంజీఎం స్టూడియోస్ సంస్థ.
ఈ క్రమంలో పాటిన్సన్ స్వయంగా స్పందిస్తూ, "జేమ్స్ బాండ్ సినిమా చరిత్రలో చాలా ముఖ్యమైన పాత్ర 007 పాత్రను నాకు అప్పగించడం లైఫ్ టైం అచివ్మెంట్ అని... డెనిస్, యామీ, డేవిడ్, టాన్యా, Amazon MGM Studios టీమ్ మొత్తానికి నా కృతజ్ఞతలు తెలుపుతున్నానని అన్నారు. జేమ్స్ బాండ్ క్యారెక్టర్ తనకు చాలా ఇష్టమైందని.. ఈ పాత్రలో నటించడం తనకు చాలా ఉత్సాహాన్ని ఇస్తుందని అన్నారు.
►ALSO READ | Mirnalini Ravi Wedding: హీరోయిన్ మిర్నాళిని రవి పెళ్లి.. ప్రియుడితో ఏడడుగులు.. డెస్టినేషన్ వెడ్డింగ్ ఫొటోలు వైరల్!
డైరెక్టర్ విలెన్యూవ్ మాట్లాడుతూ...రాబర్ట్ పాటిన్సన్‌ను కొత్త జేమ్స్ బాండ్ గా స్వాగతిస్తున్నందుకు సంతోషంగా ఉందని... అతనిలో 007 ఆత్మ ఉందని, ఈ క్యారెక్టర్ కి పూర్తిగా కొత్త ఫీల్ తెస్తాడని అన్నారు.
నిర్మాతలు పాస్కల్ మరియు హేమాన్ మాట్లాడుతూ, "బాండ్ పాత్ర సాహిత్యంలోనూ, సినిమాలోనూ చాలా ప్రభావవంతమైందని... పాటిన్సన్ ఒక నటుడిగా చాలా ఛాలెంజింగ్ క్యారెక్టర్స్ ఎంచుకుంటాడని... తనను తాను నిరంతరం రీఇన్వెంట్ చేసుకునే తీరు అతన్ని ఈ కాలానికి సరైన బాండ్‌గా చేస్తుందని అన్నారు.
