Bigg Boss Telugu 10: బిగ్ బాస్ 10లో మరో బిగ్ ట్విస్ట్.. డిక్టేటర్స్‌గా రోహిత్, షాలిని రీఎంట్రీ.. ఎవరిని టార్గెట్ చేస్తారో?

Bigg Boss Telugu 10: బిగ్ బాస్ 10లో మరో బిగ్ ట్విస్ట్.. డిక్టేటర్స్‌గా రోహిత్, షాలిని రీఎంట్రీ.. ఎవరిని టార్గెట్ చేస్తారో?

బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 రోజురోజుకూ మరింత ఉత్కంఠగా మారుతోంది. ప్రేక్షకుల అంచనాలకు అందని ట్విస్టులు, కంటెస్టెంట్ల మధ్య గొడవలు, ఎమోషనల్ డ్రామాలతో షో రసవత్తరంగా సాగుతోంది. ఇప్పటికే పది వారాలు పూర్తి చేసుకున్న ఈ షోలో పదో వారం శ్వేతా ఎలిమినేట్ అయ్యారు. ఇక పదకొండో వారం నామినేషన్ల ప్రక్రియను బిగ్ బాస్ సరికొత్తగా ప్లాన్ చేయడంతో హౌస్‌లో ఒక్కసారిగా వేడి పెరిగిపోయింది. ఈసారి నామినేషన్ల బాధ్యతను మాజీ కంటెస్టెంట్లకు అప్పగించడం అందరినీ ఆశ్చర్యపరిచింది.

సోమవారం ఎపిసోడ్‌లో డిక్టేటర్స్‌గా షాలిని, అపూర్వ, మిథిలేష్ రెడ్డి, దాక్షి గుత్తికొండ, ఝాన్సీ హౌస్‌లోకి అడుగుపెట్టారు. సింహాసనాలపై కూర్చొని ప్రస్తుత కంటెస్టెంట్ల ఆటతీరును విశ్లేషిస్తూ నామినేషన్లు చేశారు. ఈ క్రమంలో మిథిలేష్ రెడ్డి.. ముకేష్‌ను టార్గెట్ చేస్తూ ఫ్రెండ్‌షిప్‌ను బిజినెస్ ట్రాన్సాక్షన్‌లా ఉపయోగిస్తున్నావని, ముఖ్యంగా సుధీర్ విషయంలో నీ తీరు సరిగ్గా లేదని విమర్శించాడు. దీంతో ముకేష్ తీవ్రంగా స్పందించడంతో ఇద్దరి మధ్య మాటల యుద్ధం నడిచింది.

 

మరోవైపు అపూర్వ, వర్షిణి మధ్య కూడా వాగ్వాదం హీటెక్కించింది. వర్షిణి మైండ్‌సెట్, హౌస్‌లో ఆమె ప్రవర్తనపై అపూర్వ ఘాటైన వ్యాఖ్యలు చేయడంతో ముకేష్ సహా మరికొందరు కంటెస్టెంట్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో నామినేషన్ల ప్రక్రియ కాస్తా వాదోపవాదాలతో హీటెక్కింది.

 

ఇదిలా ఉంటే మంగళవారం ఎపిసోడ్‌లో మరో సర్‌ప్రైజ్ ఉండబోతున్నట్లు తెలుస్తోంది. మూడు వారాల క్రితం ఎలిమినేట్ అయిన రోహిత్ నాయుడు తిరిగి హౌస్‌లోకి ఎంట్రీ ఇవ్వనున్నాడనే ప్రచారం జోరందుకుంది. అగ్నిపరీక్ష ద్వారా షోలోకి వచ్చి తనకంటూ ప్రత్యేక అభిమానులను సంపాదించుకున్న రోహిత్ రీఎంట్రీపై ఆసక్తి నెలకొంది.

►ALSO READ | OTT New Movies: ఈ వారం ఓటీటీలోకి 15 కొత్త సినిమాలు, వెబ్‌సిరీస్‌లు..

అయితే ఆయన శాశ్వత కంటెస్టెంట్‌గా కాకుండా గెస్ట్ డిక్టేటర్‌గా రాబోతున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. నామినేషన్లు చేయడం, టాస్కుల్లో పాల్గొనడం వంటి అవకాశాలు ఉంటాయని, కానీ కెప్టెన్ కాలేడని, విజేతగా నిలిచే అర్హత కూడా ఉండదని ప్రచారం జరుగుతోంది. అయితే ఈ నిబంధనలపై అధికారిక స్పష్టత లేదు. మరి రోహిత్ రాకతో హౌస్‌లో ఎవరికి షాక్ తగలనుంది? ఎవరిని టార్గెట్ చేయబోతున్నాడు? అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.