Ramya Krishnan: భర్తకు దూరంగా రమ్యకృష్ణన్.. కృష్ణవంశీతో విడాకులపై క్లారిటీ ఇచ్చిన శివగామి!

Ramya Krishnan: భర్తకు దూరంగా రమ్యకృష్ణన్.. కృష్ణవంశీతో విడాకులపై క్లారిటీ ఇచ్చిన శివగామి!

దక్షిణాది సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా రమ్యకృష్ణన్ ఒకప్పుడు ఓ వెలుగు వెలిగింది. తన గ్లామర్ పాత్రలతోనే కాదు.. నీలాంబరి, శివగామి వంటి పవర్‌ఫుల్ పాత్రలతో ప్రేక్షకుల గుండెల్లో చెరగని స్థానం సంపాదించుకున్నారు. అయితే కొంతకాలంగా ఆమె సినిమాల కంటే.. వ్యక్తిగత జీవితానికి సంబంధించిన వార్తలే ఎక్కువగా సోషల్ మీడియాలో చర్చనీయాంశమవుతున్నాయి. ముఖ్యంగా దర్శకుడు కృష్ణవంశీతో ఆమె విడిపోయారంటూ చాలాకాలంగా ప్రచారం జరుగుతోంది.  లేటెస్ట్ గా ఈ పుకార్లపై రమ్యకృష్ణన్ స్పందిస్తూ క్లారిటీ ఇచ్చేసింది.

2003లో క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు రమ్యకృష్ణన్. వీరికి రిత్విక్ అనే కుమారుడు ఉన్నాడు. అయితే వృత్తిపరమైన కారణాలతో ఇద్దరూ వేర్వేరు నగరాల్లో ఉంటున్నారనే విషయం బయటకు రావడంతో విడాకుల వార్తలు మొదలయ్యాయి. ఒకే ఇంట్లో కనిపించకపోవడం, కలిసి కార్యక్రమాలకు హాజరుకాకపోవడం వంటి అంశాలు ఈ ప్రచారానికి మరింత ఆజ్యం పోశాయి. కానీ ఈ వార్తల్లో నిజం లేదని రమ్యకృష్ణన్ స్పష్టం చేశారు.

 సీరియల్స్‌లో నటించడం ప్రారంభించిన తర్వాత షూటింగ్ కారణంగా ప్రతి 15 రోజులకు ఒకసారి చెన్నై వెళ్లాల్సి వచ్చేదని ఆమె వెల్లడించారు. ఆ సమయంలో తమ కుమారుడు తరచూ అనారోగ్యానికి గురయ్యేవాడని, అతడి బాగోగులు చూసుకోవడం కోసం తాను కూడా అతడితో కలిసి ఒకే నగరంలో ఉండాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. దీంతో కృష్ణవంశీ ఒకచోట, తాను కుమారుడితో మరోచోట ఉంటున్నామని వివరించారు.

►ALSO READ | రియల్ స్టార్ శ్రీహరి ఇంట పెళ్లి సందడి.. ఓ ఇంటివాడు కాబోతున్న పెద్ద కుమారుడు!

తామిద్దరం ఇప్పటికే భారాభర్తలమేనని, ఒకరినొకరు అర్థం చేసుకుని సంతోషంగా వేర్వేరు నగరాల్లో ఉంటున్నామని  రమ్యకృష్ణ తెలిపారు.  తమ వృత్తులు, కటుంబ పరిస్థితులే దీనికి కారణమని వివరించారు. భార్యభర్తల కంటే తామిద్దరం మంచి స్నేహితులమని .. అందుకే తమ బంధం ఇప్పటికీ ఎంతో సంతోషంగా కొనసాగుతోందని నవ్వుతూ చెప్పుకొచ్చారు.దీంతో ఇన్నాళ్లుగా సాగుతున్న విడాకుల ప్రచారానికి ఆమె సమాధానం ఇచ్చినట్లయింది.

కేవలం 14 ఏళ్ల వయసులోనే హీరోయిన్‌గా కెరీర్ ప్రారంభించిన రమ్యకృష్ణన్.. ఎన్నో భాషల్లో వందలాది చిత్రాల్లో నటించారు. 'నరసింహ'లో నీలాంబరిగా, 'బాహుబలి'లో శివగామిగా ఆమె చేసిన నటన ప్రేక్షకులపై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం కూడా విభిన్నమైన పాత్రలతో అలరిస్తూ తన సత్తా చాటుతున్నారు. మొత్తానికి విడిపోయారంటూ వస్తున్న ప్రచారానికి రమ్యకృష్ణన్ క్లారిటీ ఇవ్వడంతో ఫుల్ స్టాప్ పడింది..