ఈ రాక్షస ఆనందం ఏంట్రా: బ్రేకప్ చెప్పిందని కుక్కులను చంపుతూ లైవ్ ఇచ్చాడు..

ఈ రాక్షస ఆనందం ఏంట్రా: బ్రేకప్ చెప్పిందని కుక్కులను చంపుతూ లైవ్ ఇచ్చాడు..

అమ్మో.. అమ్మో.. వీళ్లు వీళ్ల ఆలోచనలు చూస్తుంటే వణుకు పుడుతోంది. నిన్నా మొన్నటికి వరకు ఇద్దరూ ప్రేమించుకున్నారు. ఏమైందో ఏమో.. అమ్మాయి తూచ్ అని చెప్పింది. లవ్ లేదు ఏమీ లేదు అంటూ బ్రేకప్ చెప్పింది. దీంతో మనోడికి చిర్రెత్తుకొచ్చింది. నాకే బ్రేకప్ చెబుతావా అంటూ.. ఆ అమ్మాయి ఎంతో ఇష్టంగా పెంచుకుంటున్న రెండు కుక్కలను చంపేశాడు.. మామూలుగా చంపితే తన రాక్షసత్వం ఎలా తెలుస్తుంది అనుక్కున్నాడో ఏమో.. ఆ రెండు పెంపుడు కుక్కలను చంపుతూ.. బ్రేకప్ చెప్పిన అమ్మాయికి ఆన్ లైన్ ద్వారా లైవ్ ఇచ్చాడు.. వీడు చేసిన పనికి.. వీడు మామూలు సైకో కాదు అంటూ తిట్టిపోస్తున్నారు నెటిజన్లు.. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

కోల్‌కతా జాదవ్‌పూర్ ప్రాంతంలో ఒక యువకుడు తన మాజీ ప్రియురాలు పెంచుకున్న రెండు కుక్కలను దారుణంగా చంపాడని పోలీసులు తెలిపారు. ఆ సంఘటనను వీడియో కాల్‌లో ఆమెకు చూపించాడని పేర్కొన్నారు.

నిందితుడు సంజీబ్ భట్టాచార్య, DJ పారి నోవా లవర్స్. జాదవ్‌పూర్‌లోని బిక్రమ్‌గఢ్ ఫ్లాట్‌లో లీవ్‎ ఇన్ రిలేషన్‎షిప్‎లో ఉండేవారు. ఏమోందో తెలియదు కానీ ఇద్దరికి బ్రేకప్ అయ్యింది. పారి నోవా ప్రియుడితో సంబంధాన్ని తెంచుకుని ఫ్లాట్ వదిలి వెళ్ళిపోయింది. అయితే, ఆమె ఎంతో ఇష్టంగా పెంచుకున్న పెంపుడు కుక్కలు ఇక్కడే ఉండిపోయాయి.

►ALSO READ | శాఖాహారి బాబా అంటూ డబ్బాలు : గొంతులో ఇరుక్కున్న చేప ముల్లుతో బయటపడిన బండారం

బ్రేకప్‌తో కోపానికి గురైన భట్టాచార్య తన మాజీ ప్రియురాలు పెంచుకున్న రెండు కుక్కలను దారుణంగా చంపేశాడు. పారి నావోకు వీడియో కాల్ చేసి కుక్కలలో ఒకదాని మెడకు తాడు బిగించి ఉరివేసి చంపేశాడు. మరో శునకాన్ని తీవ్రంగా కొట్టి చంపాడు. సంజీబ్ భట్టాచార్య సైకో ప్రవర్తనతో హడలిపోయిన పారినోవా పోలీసులకు సమాచారం అందించింది. జాదవ్‌పూర్ పోలీసులు వెంటనే సంజీబ్ భట్టాచార్య ఫ్లాట్‎కు వెళ్లి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. 

చనిపోయిన కుక్కల శవాలను పోస్ట్‌మార్టమ్‌కు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. స్థానికులు, జంతు ప్రేమికులు ఈ ఘటనపై ఆందోళన వ్యక్తం చేశారు. మనుషులపై కోపంతో మాటలు రాని మూగజీవాలను చంపడమేంటని సంజీబ్ భట్టాచార్యపై మండిపడుతున్నారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.