శని భగవానుడు.. శని గ్రహం.. అంటే జనాలు భయపడతారు. జ్యోతిష్య శాస్త్రంలో శని దేవుడు కర్మఫలదాతగా.. న్యాయాధిపతిగా ఉంటారని పండితులు చెబుతున్నారు. ఈ కారణంగానే గ్రహాల అన్నింటిలోకి శని దేవుని కదలికకు జ్యోతిష్య నిపుణులు అత్యంత ప్రాధాన్యత ఇస్తారు. 2027 ఫిబ్రవరి 8 వరకు శనిభగవానుడు మీనరాశి..ఉత్తరాభాద్ర నక్షత్రంలోసంచరిస్తాడని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. ఈ కారణంగా ఆరు రాశుల వారికి ( వృషభం, మిథునం, కన్య, తుల, మకరం, కుంభం ) కెరీర్, ఆర్థిక పరమైన రంగాల్లో మంచి విజయం సాధించే అవకాశం ఉందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు ఇప్పుడు ఆ రాశుల గురించి తెలుసుకుందాం..!
జ్యోతిష్య శాస్త్రంలో శనిదేవుడి కదలికలకు ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. కర్మఫల దాతగా పిలిచే శని తన వేగాన్ని లేదా స్థానాన్ని మార్చుకున్నప్పుడల్లా ద్వాదశ రాశులపై ఆ ప్రభావం బలంగా కనిపిస్తుంది. ప్రస్తుతం శనిదేవుడు మీన రాశిలో ఉంటూ, తన సొంత నక్షత్రమైన ఉత్తరాభాద్ర నక్షత్రంలో సంచరిస్తున్నాడు.
అదృష్టం వరించే 6 రాశులు
వృషభ రాశి : ఈ రాశి వారికి శని సంచారం ఉత్తరాబాధ్ర నక్షత్రంలో సంచారం వలన ఈ రాశి వారి ఇబ్బందులు తగ్గుముఖం పడతాయని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. ప్రతి పనిలో కూడా అన్ని విధాలుగా మంచి అవకాశాలు ఉంటాయి. కుటుంబంలో పరిష్కారం కాని ఆస్తి సమస్యలు ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. నిరుద్యోగులకు ఆశించిన జాబ్ వస్తుంది. ఉద్యోగస్తులకు ఉన్నతాధికారుల నుంచి ప్రశంశలు వస్తాయి. ప్రమోషన్ తో పాటు వేతనం పెరిగే అవకాశం ఉంది. వీరికి కెరీర్ పరంగా అద్భుతంగా కలిసి వస్తుంది.వ్యాపారస్తులు ఎక్కువ లాభాలు అందుకుంటారు. ఆర్థిక పరమైన సమస్యల నుంచి బయటపడతారు. గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి ఎక్కువ లాభాలు అందుకుంటారు. ఆర్థికంగా, ఆరోగ్య పరంగా అన్ని విధాలుగా కలిసి వస్తుంది.
మిథున రాశి : ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని సంచారం వలన ఈ రాశి వారికి కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడే అవకాశం ఉందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. అనుకోని విజయాలు కలుగుతాయి. పట్టుదలతో అనుకున్న పనిని పూర్తి చేస్తారు. కోర్టు వివాదాలు అనుకూలంగా ఉంటాయి. సమాజంలో గౌరవం, కీర్తి, ప్రతిష్టలు పెరుగుతాయి. ఉద్యోగస్తులకు వేతనం పెరిగే అవకాశం ఉంది. వ్యాపారస్తులు ఊహించని లాభాలు అందుకుంటారు. మీ కష్టానికి మంచి ఫలితాలు వస్తాయి. మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడే అవకాశం ఉంది. మీ ఆత్మ విశ్వాసం పెరుగుతుంది. అనుకోకుండా సంపాదన పెరగడంతో ఆర్థిక స్థిరత్వం లభిస్తుంది. కొత్త పెట్టుబడులకు ఇది అనుకూల సమయమని జ్యోతిష్య శాస్త్రం ద్వారా తెలుస్తుంది.వృత్తి, వ్యక్తిగత జీవితం బ్యాలెన్స్ చేసుకోవడంలో విజయం సాధించే అవకాశం ఉందని పండితులు చెబుతున్నారు.
కన్యా రాశి : ఈ రాశి వారికి శని భగవానుడు మీనరాశి.. ఉత్తరాభాద్ర నక్షత్రంలో సంచారం కొత్త సంతోషాలు కలిగే అవకాశం ఉంది. ప్రతికూల పరిస్థితుల నుంచి భారీ ఊరట కలుగుతుందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. దీర్ఘకాలంగా పెండింగ్ పనులు పూర్తవుతాయి. ఉద్యోగస్తులు కార్యాలయంలో కీలక బాధ్యతలు పోషించాల్సి ఉంటుంది. వ్యాపారస్తులకు ఊహించని లాభాలుంటాయి. ఆర్థిక పరిస్థి తి బలపడుతుంది. పూర్వీకుల ఆస్తి కలసి వస్తుంది. నిరుద్యోగులు శుభవార్తలు వింటారు.
చేతి వృత్తుల వారికి పురోగతి కనిపిస్తుంది. దాంపత్య జీవితంతో పాటు ప్రేమ వ్యవహారాలు కూడా సాఫీగా, ఆనందంగా సాగుతాయని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.
►ALSO READ | కార్తీకమాసం: అక్షయనవమి( నవంబర్18) ... ఉసిరి చెట్టుకు లక్ష్మీదేవి పూజ.. ఐశ్వర్యం రెట్టింపు..!
తులా రాశి : ఈ రాశి వారికి శనిదేవుడు ఉత్తరాబాధ్ర నక్షత్రంలో సంచారం వలన వీరి కుటుంబంలో ఎంతో మేలు కలుగుతుంది. చేతి వృత్తుల వారికి ఊహించని పురోగతి ఉండే అవకాశం ఉంది. ఉద్యోగస్తులకు అన్ని విధాలా అనుకూలమైన ఫలితాలతో పాటు.. ప్రమోషన్ రావడం.. వేతనం పెరిగే అవకాశాలున్నాయని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. కోర్టు వ్యవహారాల విషయంలో అనుకూలంగా సమస్యలు పరిష్కారమవుతాయి. .వ్యాపారస్తులకు మంచి ఆర్థిక లాభాలను ఇచ్చే కొత్త ఒప్పందాలు కుదురుతాయి.కెరీర్ పరంగా మంచి పురోగతి లభిస్తుంది. వ్యాపారులు మెరుగైన లాభాలు పొందే అవకాశాలున్నాయి. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. చాలా కాలంగా వేధిస్తున్న సమస్యల నుంచి ఉపశమనం పొందుతారని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.
మకర రాశి : ఉత్తరాబాధ్ర నక్షత్రం..మీనరాశిలో సంచారం వలన ఈరాశి వారికి ఆర్థికంగా లాభదాయకంగా ఉంటుంది. చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న పనులు పూర్తవుతాయి. ఆకస్మికంగా ధనప్రాప్తి కలుగుతుంది. పూర్వీకుల ఆస్తి కలిసి వచ్చే అవకాశం ఉంది. వీరికి అదృష్ట బలం పూర్తిగా లభిస్తుంది. అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తవుతాయి. వ్యాపారంలో పెట్టుబడులు పెట్టే వారికి మంచి లాభాలు వస్తాయి. జీవిత భాగస్వామితో బంధం మరింత బలపడుతుంది. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. ఉద్యోగస్తులకు ఆఫీస్‌లో పదోన్నతులు లేదా గుర్తింపు లభించే అవకాశం ఉంది. కొత్త ప్రాజెక్టులు విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి పొదుపు చేసే అవకాశం దక్కుతుంది. ప్రేమ జీవితంలో మాధుర్యం పెరుగుతుందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.
కుంభ రాశి : శనిదేవుడు ఉత్తరాబాధ్ర నక్షత్రంలో సంచారం వలన ఈ రాశి వారికి ఆర్థికంగా ఎంతో మేలు కలుగుతుందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. ఊహించని మార్గాల ద్వారా ధన లాభం పొందే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నవారికి కెరీర్ పరంగా శుభవార్తలు అందుతాయి. గతంలో నిలిచిపోయిన పనులు వేగవంతమవుతాయి. మీ ప్రణాళికలు విజయవంతమయ్యే అవకాశం ఉంది. మీరు తీసుకొనే వ్యూహాత్మక నిర్ణయాలు అనుకూలంగా ఉంటాయి. పెళ్లి ప్రయత్నాలతో పాటు ఆదాయ వృద్ధి ప్రయత్నాలు కూడా నూరు శాతం సక్సెస్ అవుతాయి. ఆర్థిక సమస్యలు, వివాదాలు అనుకూలంగా పరిష్కారమవుతాయి. విదేశీ ఉద్యోగాలకు ప్రయత్నించడం చాలా మంచిది. . కోర్టు కేసులు మీకు అనుకూలంగా తీర్పులు వస్తాయి. బంధువులతో ఏర్పడిన వివాదాలు సమసిపోతాయని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.
ఈ రాశుల వారు జాగ్రత్తగా ఉండాలి
శని భగవానుడు ఉత్తరాభాద్ర నక్షత్రంలో సంచారం వలన మేషరాశి, కర్కాటక రాశి, సింహరాశి, ధనుస్సు రాశులకు చెందిన జాతకులకు ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. ఈ రాశుల వారు ఆర్థిక లావాదేవీలు, ఆరోగ్యం, ఉద్యోగ విషయాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా అప్రమత్తంగా ఉండాలని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. ఈరాశి వారు శని వారం శనిభగవానుడికి తైలాభిషేకం .. నువ్వుల దానం.. పేదలకు అన్నదానం చేయాలని పండితులు చెబుతున్నారు.
Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని జ్యోతిష్య నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించరు. మీకున్న జ్యోతిష్య సమస్యలకు నిపుణులను సంప్రదించటం ఉత్తమం.
