సోషల్ మీడియా ఏ రేంజ్ ల వ్యాపించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. స్కూల్ కి వెళ్లే పిల్లలు మొదలుకొని..రిటైర్ అయ్యి ఇంట్లో కూర్చున్న పెద్దల వరకు ప్రతి ఒక్కరు సోషల్ మీడియాకు బానిసైన పరిస్థితి నెలకొంది. జనాల్లో ఉన్న సోషల్ మీడియా వీక్ నెస్ ని ఆసరాగా చేసుకొని ఘరానా మోసాలకు పాల్పడుతున్నారు కేటుగాళ్ళు. విశాఖపట్నంలో ఇలాంటి ఘటన చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి...
ఇన్స్టాగ్రామ్లో పరిచయమైన ఓ మహిళ.. మాయమాటలు చెప్పి పెద్దఎత్తున బంగారు ఆభరణాలను దోచుకెళ్లిన ఘటన కలకలం రేపింది. విశాఖపట్నంలోని నాలుగో పట్టాన పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది ఈ ఘటన. విశాఖకు చెందిన ఓ వ్యక్తికి ఇన్స్టాగ్రామ్ లో ఓ మహిళ పరిచయం అయ్యింది. కొన్నాళ్ళ చాటింగ్ తర్వాత.. అనారోగ్యంతో బాధపడుతున్నాని చెప్పి అతడి ఇంటికి మకాం మార్చింది సదరు కిలాడీ.
రోజుల తరబడి అతడి ఇంట్లోనే తిష్ట వేసిన కిలాడీ లేడీ.. భారీ మోసానికి పాల్పడింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో బీరువాలో దాచిన బంగారు ఆభరణాలను దొంగలించి పరారయ్యింది.. విషయం తెలుసుకున్న బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. తన ఇంట్లో ఉన్న 11.3 గ్రాముల డైమండ్ నెక్లెస్ తో పాటు ఇతర బంగారు ఆభరణాలు చోరీకి గురయియ్యని పోలీసులకు ఫిర్యాదు చేశాడు బాధితుడు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. సోషల్ మీడియా పరిచయాల పట్ల ప్రమత్తంగా ఉండాలని.. ముఖపరిచయం లేనివారికి ఇంట్లో ఆశ్రయం ఇవ్వొద్దని సూచిస్తున్నారు పోలీసులు.
