జ్యోతిష్యం:నెల రోజుల పాటు నవ పంచమయోగం.. 3 రాశుల వారికి దశ తిరిగిపోద్ది..!

జ్యోతిష్యం:నెల రోజుల పాటు  నవ పంచమయోగం.. 3 రాశుల వారికి దశ తిరిగిపోద్ది..!

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం  2026 నవంబర్ 16న   నవ పంచమ యోగం ఏర్పడింది. గ్రహాలు కాలానుగుణంగా వాటి రాశులను, నక్షత్రాలను మారుస్తూ ఉంటాయి. అలాంటప్పుడు శుభ యోగాలు, అశుభ యోగాలు ఏర్పడడం చూస్తూ ఉంటాం. శని.. సూర్యుడు గ్రహాల మధ్య  2026 నవంబర్​ 16 రాత్రి 07:48 గంటలకు విశేషమైన  నవపంచమయోగం ఏర్పడుతోంది. ఈ యోగం వల్ల మూడు  రాశుల వారికి ప్రయోజనాలు కలుగుతాయని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.ఇప్పుడు ఆ రాశుల గురించి తెలుసుకుందాం. . ..!

జ్యోతిష్య నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం  శని,  సూర్యుడు 5 మరియు  9 స్థానాల్లో ఒకదానికొకటి 120 డిగ్రీల కోణంలో ఉండటం వల్ల నవ పంచమ శుభ యోగం ఏర్పడుతుంది. ఈ శుభ యోగం మూడు  రాశులకు అద్భుతమైన ప్రయోజనాలు కలగనున్నాయి. శని దేవుడు న్యాయం, క్రమశిక్షణ, కర్మ, కష్టపడి పనిచేయడం వంటి విషయాలతో  ఇవ్వడంతో సంబంధం కలిగి ఉంటాడు. ఈ యోగం 2026 డిసెంబర్ 16 వరకు కొనసాగుతుంది.

కర్కాటక రాశి:  సూర్యుడు.. శని మధ్య 120 డిగ్రీల కోణంలో నవమపంచమయోగం ఏర్పడటం వలన ఈరాశి వారికి కష్టానికి తగిన ఫలితాన్ని పొందుతారు. చాలా కాలంగా నిలిచిపోయిన పాత బకాయిలు చేతికి వస్తాయి. ఉద్యోగస్తులకు అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది.  పదోన్నతి అవకాశాలు పెరుగుతాయి. ఆకస్మిక ధనలాభం కూడా ఉంటుంది. వ్యాపారస్తులకు గత పెట్టుబడులనుంచి భారీ లాభాలు అందుకుంటారు.  కొత్త కష్టమర్లు పరిచమవుతారు.ఆర్థికంగా అనుకోని లాభాలు వచ్చే చాన్స్ ఉందని పేర్కొంటున్నారు.   కేరీర్ లో ఉన్నత‌స్థానాన్ని పొందుతారు.  ఇప్పటి వ‌ర‌కు మిమ్మల‌ను వ్యతిరేకించిన వారే మీ స‌హాయాన్ని అర్దిస్తారు. వ్యాపారంలో కొత్త ఒప్పందాలు  కుదిరే అవకాశం ఉందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.

వృశ్చిక రాశి :   సూర్యుడి సంచారం, శనితో ఏర్పడే నవపంచమ యోగం వలన ఈ రాశి వారికి  చాలా శుభప్రదమైనదని పండితులు చెబుతున్నారు.  ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న ప్రాజెక్ట్​లు ఈ సమయంలో చేతికి అందుతాయి. ధైర్యంతో పాటు.. ఆత్మవిశ్వాసం పెరిగే అవకాశం ఉంది. సమాజంలో కీర్తి, ప్రతిష్టలు,, గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. పని, వృత్తికి సంబంధించిన  విషయాల్లో మార్పులు జరిగే అవకాశం ఉంది.  .చేతి వృత్తుల వారికి అద్భుతమైన అవకాశాలు కూడా లభిస్తాయి.  సంతానం కోసం ఎదురు చూసే వారు శుభ‌వార్త వింటారు.  వ్యాపార‌స్తుల‌కు అధికంగా లాభాలు వ‌స్తాయి.  కొత్తగా పెట్టుబ‌డులు పెట్టేందుకు  చాలా అనుకూలంగా ఉంది. విదేశీ వ్యాపారం చేసే వారికి అనుకోకుండా ఆర్డర్లు వ‌స్తాయి. ఉద్యోగ‌స్తులకు  స‌హోద్యోగ‌ల అండ‌దండ‌లు ఉంటాయి.  మీ బాస్ మీకు కొన్ని కీల‌క‌మైన ప‌నులు అప్పగించే అవ‌కాశం ఉంటుంది.  ఇది మీ లైఫ్ న‌కు ట‌ర్నింగ్ పాయింట్అయ్యే అవకాశం ఉందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.  

►ALSO READ | Childrens Food: పిల్లలకు డైట్టిప్స్ .. క్షణాల్లో ప్లేట్ ఖాళీ చేస్తారు..!

మకర రాశి :  సూర్యుడు.. శని మధ్య నవ పంచమ యోగ్ం ఏర్పడటం వలన ఈ రాశి వారికి అనుకోకుండా ఆదాయం పెరిగే అవకాశం ఉంది. నిరుద్యోగులకు ఆశించిన జాబ్​ వచ్చే అవకాశం ఉంది. ఆర్థికంగా బలపడేందుకు కొత్త మార్గాలు ఏర్పడుతాయి. కెరీర్ లో మంచి మార్పులు క‌లుగుతాయి.  ఉద్యోగ‌స్తుల‌కు.. వ్యాపార‌స్తుల‌కు అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది.  వ్యక్తిగ‌త జీవితంలో సాఫీగా సాగిపోతుంది.  పెండింగ్ ప‌నులు  పూర్తి చేయ‌గ‌లుగుతారు.  ఉద్యోగ‌స్తులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న శుభవార్త వినే అవకాశం ఉందని  పండితులు సూచిస్తున్నారు.  వ్యాపార‌స్తులకు అధింగా లాభాలు .  స‌మాజంలో కీర్తి గౌరవం పొందుతారు. 

Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని జ్యోతిష్య నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించరు. మీకున్న  జ్యోతిష్య సమస్యలకు నిపుణులను సంప్రదించటం ఉత్తమం.