చేతులెలా వచ్చాయి తల్లి..! ఎనిమిది నెలల పాపను గొంతు నులిమి చంపేసి.. తానూ లైజాల్ తాగి....!

చేతులెలా వచ్చాయి తల్లి..! ఎనిమిది నెలల పాపను గొంతు నులిమి చంపేసి.. తానూ లైజాల్ తాగి....!

మహబూబాబాద్ జిల్లాలో దారుణం జరిగింది. ఎనిమిది నెలల పాపను గొంతు నులిమి చంపేసింది ఓ తల్లి. ఆ తర్వాత తాను కూడా లైజాల్ తాగి ఆత్మహత్యాయత్నం చేసింది.సోమవారం ( నవంబర్ 16 ) జరిగిన ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి.. మహబూబాబాద్ మండలం ధామ్య తండా శివారు జేత్యా తండా లో జరిగింది ఈ విషాద ఘటన.

జేత్యా తండాకు చెందిన సుప్రజ తన ఎనిమిది నెలల పాప త్రిషను గొంతు నులిమి చంపేసింది. ఆ తర్వాత తాను కూడా లైజాల్ తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. అపస్మారక స్థితిలో ఉన్న సుప్రజను మహబూబాబాద్ ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని పరిస్థితిని పరిశీలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. కుటుంబ కలహాలే ఈ ఘటనకు కారణమని భావిస్తున్నారు. ఎనిమిది నెలల పసికందును తల్లి అమానుషంగా చంపిన ఈ ఘటనతో జేత్యా తండాలో విషాదం నెలకొంది. బంగారం లాంటి పిల్లను గొంతు నులిమి చంపడానికి ఆ తల్లికి చేతులెలా వచ్చాయో అంటున్నారు స్థానికులు.