అక్వాన్ తుఫాను ఏపీ వైపు దూసుకొస్తోంది. నవంబర్ 20న తుఫాను తీరం తాకే అవకాశం ఉన్న క్రమంలో అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు సీఎం చంద్రబాబు. RTGS సెంటర్ లో పరిస్థితిని పరిస్థితిని సమీక్షించిన ఆయన తక్షణమే అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు.
బంగాళాఖాతంలో ప్రస్తుతం ఉన్న తీవ్రమైన అల్పపీడనం సోమవారం సాయంత్రానికి సైక్లోన్‌గా మారే అవకాశం ఉందని అధికారులు సీఎంకు వెల్లడించారు. నవంబర్ 19, 20 తేదీల్లో కోస్తాంధ్రలో మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. కోనసీమ, కాకినాడ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, NTR, గుంటూరు జిల్లాలపై సైక్లోన్ ప్రభావం ఉండే అవకాశం ఉందని తెలిపారు అధికారులు.
తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో ముందస్తుగా NDRF, SDRF బృందాలను మోహరించాలని... విద్యుత్ సేవలకు అంతరాయం ఏర్పడిన వెంటనే పునరుద్ధరించేందుకు సిబ్బందిని సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు సీఎం చంద్రబాబు.భారీ వర్షాల వల్ల వచ్చే వరద నీటిని రిజర్వాయర్లకు మళ్లించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని, కేంద్ర అంచనా బృందం సిఫార్సులను ఫీల్డ్ స్థాయిలో అమలు చేయాలని అధికారులకు సూచించారు చంద్రబాబు. పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని.. ఎలాంటి నిర్లక్ష్యం వద్దని స్పష్టం చేశారు చంద్రబాబు.
