ఆత్మకథ రాయడానికి అసలు కారణమేంటో రివీల్ చేసిన సోనియా

ఆత్మకథ రాయడానికి అసలు కారణమేంటో రివీల్ చేసిన సోనియా

న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్ పర్సన్ సోనియా గాంధీ తన ఆత్మకథ రాయడానికి, పుస్తకానికి ఆ పేరు పెట్టడానికి గల అసలు కారణమేంటో రివీల్ చేశారు. తన కుటుంబం గురించి బయట జరుగుతున్న అవాస్తవ ప్రచారాలు, బాధ కలిగించే వ్యాఖ్యలకు సమాధానంగా అసలు నిజాన్ని ప్రపంచానికి తెలియజేయడానికే తన ఆత్మకథ రాసినట్లు ఆమె స్పష్టం చేశారు. ఇటలీ నుంచి ఒక పరాయి వ్యక్తిగా భారతదేశానికి వచ్చినప్పుడు.. ఇక్కడి సంస్కృతిలో మమేకం కావడానికి, అందరి ఆమోదం పొందడానికి తాను ఎంతో ప్రయత్నించానని పేర్కొన్నారు. పెళ్లి తర్వాత అత్తారింటికి వెళ్లే ప్రతి భారతీయ మహిళ ఎదుర్కొనే సర్దుబాటు కష్టాలే తనకూ ఎదురయ్యాయని.. అందుకే ఈ పుస్తకానికి 'బిలాంగింగ్' అనే పేరు పెట్టినట్లు సోనియా వివరించారు.

బిలాంగింగ్ ఎ జర్నీ ఆఫ్ లవ్ పేరుతో సోనియా గాంధీ తన ఆత్మకథ రాసిన విషయం తెలిసిందే. 2026, నవంబర్ 10న సోనియా మెమోయిర్ దేశవ్యాప్తంగా విడుదలైంది. దీని అధికారిక పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం సోమవారం (నవంబర్ 16) న్యూఢిల్లీలో జరిగింది. ఈ కార్యక్రమంలో సోనియా మాట్లాడుతూ.. తన అత్త ఇందిరా గాంధీ, భర్త రాజీవ్ గాంధీ, పిల్లలు రాహుల్, ప్రియాంకలతో పాటు తన గురించి కూడా ఎన్నో కల్పిత కథలు, అవాస్తవాలు మాటలు ప్రచారంలో ఉన్నాయని తెలిపారు. 

►ALSO READ | TVS ఫ్యామిలీలో ఆస్తుల లొల్లి.. తండ్రి వేణు శ్రీనివాసన్‌కు లక్ష్మీ వేణు లీగల్ నోటీసు

అసలు తన కుటుంబ సభ్యులకు ఏమాత్రం సంబంధం లేని విషయాలను.. ఎంతో బాధ కలిగించే అబద్ధాలను ప్రచారం చేశారనిఆవేదన వ్యక్తం చేశారు. ఆ అవాస్తవాలు, అపోహలను తొలగించి అసలు నిజమేంటో ప్రపంచానికి చెప్పడానికి ఆత్మకథ రాసినట్లు తెలిపారు. అయితే, వ్యక్తిగత విషయాలను బయటపెట్టడం తనకు ఇష్టం ఉండదని.. రాహుల్, ప్రియాంక అలాగే ఒక సన్నిహిత స్నేహితురాలు నిరంతరం ప్రోత్సహించడంతోనే చివరకు రాయడానికి అంగీకరించినట్లు వెల్లడించారు. తనకు డైరీ రాసే అలవాటు లేకపోవడం వల్ల పాత విషయాలను గుర్తుచేసుకోవడం కొంత కష్టమైందని తెలిపారు. ముఖ్యంగా ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీల మరణాల వంటి బాధాకరమైన ఘట్టాలను రాస్తున్నప్పుడు తీవ్రమైన భావోద్వేగానికి లోనైనట్లు సోనియా చెప్పారు. 

.