నిజాంపేట్ KPN ఫ్రెష్లో కర్జూర బాక్స్ కొన్న కస్టమర్.. ఇంటికెళ్లి చూడగా షాక్

నిజాంపేట్ KPN ఫ్రెష్లో కర్జూర బాక్స్ కొన్న కస్టమర్.. ఇంటికెళ్లి చూడగా షాక్

హైదరాబాద్ నిజాంపేట్ రోడ్డులో ఉన్న కేపీఎన్ ఫ్రెష్ సూపర్ మార్కెట్ కు వెళ్లిన కస్టమర్లకు చేదు అనుభవం ఎదురైంది. కర్జూరాలు కొని ఇంటికెళ్లి బాక్సు ఓపెన్ చేయగా కుళ్ళిపోయిన స్థితిలో ఉండటం చూసి ఆశ్చర్యానికి గురయ్యారు. వెంటనే వెళ్లి రిటన్ చేసి.. వేరే బాక్సులు ఓపెన్ చేసి చూడగా అవి కూడా బూజు పట్టి కుళ్లిపోయి ఉన్నాయని కస్టమర్లు చెబుతున్నారు. 

ఎటువంటి గడువు లేకుండ దర్జాగా కుళ్లిన డేట్స్ అమ్ముతున్న సూపర్ మార్కెట్ వ్యవహారంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.  దీనిపై సిబ్బందిని ప్రశ్నించగా బాక్స్ ఓపెన్ చేసి చూస్తామంటూ  పొంతనలేని సమాధానం చెప్పే ప్రయత్నం చేశారు. తెచ్చిన డేట్స్  తిరిగివ ఇచ్చి మిగతా బాక్స్ లు చెక్ చేయగా అన్ని బూజు పట్టి ఉండడంతో ఇతర కస్టమర్స్ కంగుతిన్నారు . నిబంధనలకు విరుద్ధంగా కుళ్లిన డేట్స్ అమ్ముతున్న కేపిఎన్ ఫ్రెష్ ఫై చర్యలు తీసుకొని.. వెంటనే సీజ్ చేయాలనీ కస్టమర్స్ డిమాండ్ చేశారు.