కాజీపేట YSR నగర్ కాలనీ భూముల కబ్జాపై పూర్తి ఆధారాలు ఇవే: ఎమ్మెల్యే నాయిని రాజేంధర్ రెడ్డి

 కాజీపేట YSR నగర్ కాలనీ భూముల కబ్జాపై పూర్తి ఆధారాలు ఇవే: ఎమ్మెల్యే నాయిని రాజేంధర్ రెడ్డి

 కాజీపేట YSR నగర్ కాలనీ భూములను కబ్జా చేయాలని చూసిన వారే ఇప్పుడు తమపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్. 2026 నవంబర్ 17న ప్రెస్ మీట్ ఏర్పాటు చేసిన నాయిని.. తనను  రాజకీయంగా బద్నాం చేసేందుకు  YSRనగర్ భూములను తెరపైకి తీసుకొచ్చారని తెలిపారు. 

YSR నగర్ భూముల దగ్గర 144 సెక్షన్ విధించారు. ఆ భూముల జోలికి ఎవరు వెళ్లినా పోలీసులు, రెవెన్యూ అధికారులు చర్యలు తీసుకుంటారు.  2020లో ఆ భూముల కబ్జా కోసం పట్టా చేయించుకున్న వాళ్లే  ఇవ్వాళ తనపై విమర్శలు చేస్తున్నారని అన్నారు. ఆ భూముల విషయంలో గుడిసె వాసులను పావుగా మార్చారని అన్నారు. 

మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ ఒక లాండ్ బ్రోకర్. 2019లో సీలింగ్ ల్యాండ్ కు నాలా కార్వర్ధన్ చేసిన తహసిల్దార్ జైలుకు ఇప్పుడు పోయాడు. మాజీ కుడా చైర్మన్ ,  మాజీ ఎమ్మెల్యే ఇద్దరు కలిసి కోట్ల విలువచేసే భూమి కాజేయడం కోసం స్కెచ్ వేశారు. ఈ వ్యవహారానికి సంబంధించిన వివరాలను పూర్తి ఆధారాలతో బయట పెడుతున్నాను. నా అల్లుడి పై రాజకీయ విమర్శలు చేస్తున్నారు.. నా అల్లుడు ఒక్క కబ్జాలో ఉన్నట్లు నిరూపించినా నేను దేనికైనా రెడీ.. అని అన్నారు. 

భూ కబ్జాలకు ఎవరు పాల్పడినా సహించేది లేదని ఈ సందర్భంగా అన్నారు ఎమ్మెల్యే నాయిని. ఈ విషయంలో ఇంటి దొంగలను కూడా వదిలిపెట్టనని అన్నారు. తన పార్టీ వాళ్లు ఉన్నా వదలనని.. పార్టీ నుంచి సస్పెండ్ చేస్తానని హెచ్చరించారు.