ఢిల్లీలో కుప్పకూలిన రెండంతస్థుల భవనం.. చిన్నారి సహా ఇద్దరు మృతి

ఢిల్లీలో కుప్పకూలిన రెండంతస్థుల భవనం.. చిన్నారి సహా ఇద్దరు మృతి

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో తీవ్ర విషాద ఘటన చోటు చేసుకుంది. తూర్పు ఢిల్లీలోని కస్తూర్బా నగర్‌లో మంగళవారం (నవంబర్ 17) రెండంతస్థుల భవనం కుప్పకూలింది. ఈ ఘటనలో మూడేళ్ల చిన్నారి సహా ఇద్దరు మరణించారు. శిథిలాల కింద మరో ఆరుగురు చిక్కుకున్నట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు, రెస్క్యూ బృందాలు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని సహయక చర్యలు చేపట్టారు. శిథిలాల కింద చిక్కుకున్న వారి కోసం గాలిస్తున్నారు. 

మృతులను మూడేళ్ల చిన్నారి, పింటూ అనే 35 ఏళ్ల వ్యక్తిగా గుర్తించారు. భవనం కూలిపోయినప్పుడు ఇంట్లో మొత్తం ఎనిమిది మంది ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఘటన స్థలంలో సహయక చర్యలు కొనసాగుతున్నాయి. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. బీజేపీ కౌన్సిలర్ పంకజ్ లూత్రా సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. భవనం ఉన్న భూమి రైల్వేకు చెందినదని.. అక్రమ నిర్మాణం, ఆక్రమణల వల్లే ఈ ప్రమాదం జరిగిందని ఆరోపించారు.