రాజన్న సిరిసిల్ల జిల్లాలో మరోసారి బోనాల శోభ సంతరించుకుంది. వేములవాడ బద్దిపోచమ్మ అమ్మవారి ఆలయం బోనాలతో వచ్చిన మహిళలతో కలకలలాడుతోంది. 2026 నవంబర్ 17న మహిళల బోనాల మొక్కులతో బద్దిపోచమ్మ ఆలయ పరిసరాలు కిక్కిరిసి పోయాయి.
అమ్మవారికి పట్నంతో పాటు బియ్యం, చీర, గాజులు, పసుపు, కుంకుమ సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. అమ్మవారు శాంతంగా ఉండాలని కల్లు పోసి వేడుకుంటున్ననారు మహిళలు. బోనాలతో భక్తులు భారీ ఎత్తున తరలిరావడంతో నెత్తిన బోనంతో గంటల తరబడి క్యూ లైన్ లో వేచిఉండాల్సి వస్తోంది.
డప్పు చప్పుళ్ల మధ్య బోనాల వేడుకలు కొనసాగుతున్నాయి. అందరినీ సుఖసంతోషాలతో చూడాలని భక్తులు అమ్మవారిని ప్రార్థిస్తున్నారు. రాజన్న, బీమేశ్వర స్వామి వార్ల దర్శనం అనంతరం బద్దిపోచమ్మ అమ్మవారికి బోనాల మొక్కలు తీయడం అనవాయితీగా వస్తోంది. దీంతో భారీ సంఖ్యలు అమ్మవారికి బోనాలు సమర్పించుకున్నారు మహిళలు.
