బంగాళాఖాతలంలో ఏర్పడిన తుఫాన్.. అత్యంత తీవ్ర తుఫాన్‌గా మారుతోంది. అరవీర భయంకరంగా ఇది తీరం వైపు దూసుకొస్తుంది. అత్యంత తీవ్ర తుఫాన్‌గా మారిన తర్వాత తీరం దాటనున్నట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ వెల్లడించారు. 2026, నవంబర్ 17వ తేదీ సాయంత్రానికి తీవ్ర తుఫాన్‌గా మారుతుందని ప్రకటించిన ఆయన.. నవంబర్ 20వ తేదీ మధ్యాహ్నం సమయంలో ఇది ఏపీలోనే తీరం దాటనున్నట్లు వెల్లడించారాయన.
అత్యంత తీవ్ర తుఫాన్ మారుతున్న అక్వాన్.. తీరం దాటే సమయంలో ఈదురుగాలుల వేగం 140 కిలోమీటర్ల వేగంతో ఉండొచ్చని హెచ్చరిస్తున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్.
ప్రస్తుతం అక్వాన్ తీవ్ర తుఫాన్ చెన్నైకి తూర్పున 610 కిలోమీటర్ల దూరంలో.. మచిలీపట్నానికి ఆగ్నేయంగా 660 కిలోమీటర్ల దూరంలో.. విశాఖకు దక్షిణ -ఆగ్నేయానికి 670 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఇది గంటకు 10 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. ఇదే స్పీడ్‌గా దీని ప్రయాణం ఉంటే.. నవంబర్ 20వ తేదీ శుక్రవారం మధ్యాహ్యానికి నెల్లూరు నుంచి తుని మధ్య తీరం దాటనున్నట్లు అంచనా వేస్తున్నారు. తీరం దాటే సమయంలో గంటకు 140 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని.. విధ్వంసం సృష్టించొచ్చుని అంచనా వేస్తోంది వాతావరణ శాఖ. ఇదే విషయాన్ని ఏపీ ప్రభుత్వానికి నివేదించింది.
అత్యంత తీవ్ర తుఫాన్ అక్వాన్ ప్రభావంతో.. 18వ తేదీన కోస్తాంధ్రలో వర్షాలు పడటం మొదలువుతందని.. 19, 20 తేదీల్లో కోస్తాంధ్రలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని హెచ్చరించింది వాతావరణ శాఖ.
మత్స్యకారులు ఎవరూ వేటకు వెళ్లొద్దని ఆదేశాలు ఇస్తూనే.. ఇప్పటికే సముద్రంలో వేటకు వెళ్లిన మత్స్యకారులు వెంటనే తిరిగి వచ్చేయాలని ఆదేశించింది వాతావరణ శాఖ.
ఏపీలో కోస్తాంధ్రలో 19వ తేదీ సాయంత్రం నుంచి 20వ తేదీ వరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. అత్యవసరం అయితేనే ప్రయాణాలు పెట్టుకోవాలని.. అత్యంత తీవ్ర తుఫాన్ ఆక్వాన్ తీరం దాటే సమయంలోనూ.. తీరం దాటిన తర్వాత అత్యంత భారీ వర్షాలు, పెను గాలులతో విధ్వంసం సృష్టించే అవకాశం ఉందని.. ప్రజలు అంతా అప్రమత్తంగా.. సురక్షితంగా ఉండాలని హెచ్చరించింది వాతావారణ శాఖ.
