ఆంధ్రప్రదేశ్ లో ఓఎన్జీసీ గ్యాల్ లీక్ కవాడం అంబేద్కర్ కోనసీమ జిల్లాలో తీవ్ర కలకలం రేపింది. 2026 నవంబర్ 17 ఉదయం మామిడికుదురు మండలం గెద్దాడ–మామిడికుదురు హైవేకు ఆనుకుని ఉన్న ONGC రిగ్ నుంచి గ్యాస్ భారీగా ఎగసిపడుతోంది. దీంతో స్థానికులు భయంతో పరుగులు తీశారు.
ఇరుసుమండ బ్లోఅవుట్ ఘటనను మరువకముందే మరోసారి గ్యాస్ లీక్ కావడంతో భయాందోళనలో పరిసర ప్రాంతాల ప్రజలు బిక్కుబిక్కు మంటున్నారు. హైవే పై నుంచి వెళ్లేందుకు వాహనదారులు భయపడుతున్నారు.
భారీ శబ్దాలతో గ్యాస్ లీకవుతుండటంతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని జనాలు భయపడుతున్నారు. అలర్టయిన అధికారులు పరిసర ప్రాంతాల్లో లైట్లు, విద్యుత్ పరికరాలు వినియోగించకూడదని హెచ్చరికలు జారీ చేశారు. విద్యుత్ పరికరాలు, లైట్లు వినియోగిస్తే గ్యాస్ మండి భారీ అగ్నిప్రమాదానికి కారణం అవుతుందని హెచ్చరించారు.
