• క్వార్టర్ నంబర్ 17లో గృహ ప్రవేశ కార్యక్రమం నిర్వహించిన మహేశ్ గౌడ్
హైదరాబాద్, వెలుగు: పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ తన నివాసాన్ని నార్సింగ్ నుంచి బంజారాహిల్స్ లోని మినిస్టర్ క్వార్టర్స్ కు మార్చారు. ప్రభుత్వం ఆయనకు కేటాయించిన క్వార్టర్ నంబర్ 17లో సోమవారం గృహప్రవేశ కార్యక్రమం నిర్వహించారు.
పార్టీ నాయకులు, కార్యకర్తలకు మరింత అందుబాటులో ఉండేందుకే ఆయన తన మకాంను నగర శివారు నుంచి బంజారాహిల్స్ కు మార్చుకున్నట్టు కాంగ్రెస్ పార్టీ వర్గాలు వెల్లడించాయి.
