ఖేలో ఇండియా క్రీడలనిర్వహణకు పటిష్ట ఏర్పాట్లు : సీఎస్ సంజయ్ జాజు

  ఖేలో ఇండియా క్రీడలనిర్వహణకు పటిష్ట ఏర్పాట్లు : సీఎస్  సంజయ్  జాజు

హైదరాబాద్, వెలుగు: డిసెంబర్ 11 నుంచి 22వరకు వరకు రాష్ట్రంలో నిర్వహించే ఖేలో ఇండియా యూత్ గేమ్స్-2026 జాతీయ స్థాయి క్రీడా పోటీలను విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని జిల్లాల్లో పటిష్ట ఏర్పాట్లు చేపట్టాలని సీఎస్ సంజయ్ జాజు కలెక్టర్లు, జీహెచ్ఎంసీ, మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్లను ఆదేశించారు. 

హైదరాబాద్, హనుమకొండ, ఖమ్మం, కరీంనగర్, నిజామాబాద్, మహబూబ్ నగర్ లో సుమారు 8,000 మంది క్రీడాకారులు, ఇతర ప్రతినిధులు పాల్గొననున్న ఈ క్రీడా సంబరాలకు విస్తృత ప్రచారం కల్పించడంతో పాటు విద్యార్థులు, యువత పెద్ద ఎత్తున భాగస్వాములు అయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. 

ముఖ్య కూడళ్లు, బహిరంగ ప్రదేశాల్లో హోర్డింగులు, బెలూన్లతో క్రీడల మస్కట్, లోగోలపై విస్తృత ప్రచారం నిర్వహించాలని, శంషాబాద్ ఎయిర్ పోర్ట్, సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ, కాజీపేట తదితర రైల్వే స్టేషన్లు, నగరంలోని సెంట్రల్ బస్ స్టేషన్లలో ప్రత్యేక ప్రచార ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.