షార్జా: జింబాబ్వేతో జరుగుతున్న రెండో టెస్ట్‌లో అఫ్గానిస్తాన్ ఓటమి దిశగా పయనిస్తోంది. జింబాబ్వే నిర్దేశించిన 418 రన్స్ లక్ష్యాన్ని ఛేదించేందుకు సోమవారం నాలుగో రోజు బరిలోకి దిగిన అఫ్గానిస్తాన్ రెండో ఇన్నింగ్స్‌లో 44 ఓవర్లలో 143/5 స్కోరు చేసింది. అఫ్సర్ జజాయ్ (20 బ్యాటింగ్), ఇక్రామ్ అలికిల్ (20 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు.
రహమత్ షా (30), హష్మతుల్లా షాహిది (35) ఫర్వాలేదనిపించినా.. అబ్దుల్ మాలిక్ (8), రెహమానుల్లా (15), సెడిఖుల్లా అటల్ (14) నిరాశపర్చారు. బ్రాడ్ ఇవాన్స్ 2 వికెట్లు తీశాడు. అంతకుముందు 169/7 ఓవర్‌నైట్ స్కోరుతో ఆట కొనసాగించిన జింబాబ్వే రెండో ఇన్నింగ్స్‌ను 98 ఓవర్లలో 295/9 స్కోరు వద్ద డిక్లేర్ చేసింది.
