ఫుట్‌‌బాల్‌‌కు బెల్జియం లెజెండ్‌ రొమెల్‌‌ గుడ్‌‌బై

ఫుట్‌‌బాల్‌‌కు బెల్జియం లెజెండ్‌ రొమెల్‌‌ గుడ్‌‌బై

బ్రస్సెల్స్‌‌: బెల్జియం ఫుట్‌‌బాల్‌‌ లెజెండ్‌‌ రొమెలు లుకాకు ఇంటర్నేషనల్‌‌ కెరీర్‌‌కు వీడ్కోలు పలికాడు. తన 16 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌‌కు ముగింపు పలుకుతున్నట్లు సోమవారం సోషల్‌‌ మీడియా వేదికగా ప్రకటించాడు. బెల్జియం తరఫున 135 మ్యాచ్‌‌లు ఆడిన 33 ఏళ్ల లుకాకు.. మొత్తం 94 గోల్స్ సాధించి చరిత్ర సృష్టించాడు. 

దేశం తరఫున నాలుగు ప్రపంచకప్‌‌లు, మూడు యూరోపియన్ చాంపియన్‌‌షిప్‌‌లలో ప్రాతినిధ్యం వహించినట్లు తెలిపారు. పురుషుల అంతర్జాతీయ ఫుట్‌‌బాల్‌‌లో అత్యధిక గోల్స్ సాధించిన ఆటగాళ్ల జాబితాలో క్రిస్టియానో రొనాల్డో (146), లియోనెల్ మెస్సీ (126), అలీ డైయీ (108), సునీల్ ఛెత్రి (95) తర్వాత ఐదో స్థానంలో లుకాకు నిలిచాడు. క్లబ్ ఫుట్‌‌బాల్‌‌లో మాత్రం టర్కీ క్లబ్ ఫెనెర్బాచే తరఫున రొమెల్‌‌ కొనసాగనున్నాడు.