- భావోద్వేగాలతో కూడిన పలు సందర్భాలను ఆమె గుర్తు చేసుకున్నారు
- అబద్ధపు ప్రచారానికి చెక్ అని వ్యాఖ్య
న్యూఢిల్లీ, వెలుగు: సోనియా గాంధీ ఆత్మకథ ‘బిలాంగింగ్: ఎ జర్నీ ఆఫ్ లవ్’ ఓ భావోద్వేగ ప్రయాణమని, ఆమె స్వగతం దేశ ప్రజల హృదయాలను కదిలించిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఈ పుస్తకం ప్రజల మనసులను తాకిందని, దేశవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో ప్రతులు అమ్ముడవడమే ఇందుకు నిదర్శనమని సోనియా గాంధీకి ఆయన తెలిపారు.
సోమవారం ఢిల్లీలో నిర్వహించిన సోనియా ఆత్మకథ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు. అనంతరం సోనియా గాంధీని కలిసి అభినందనలు తెలిపారు. పుస్తకంలోని ముఖ్య అంశాలు, భావోద్వేగాలతో కూడిన పలు సందర్భాలను ఆమెతో గుర్తు చేసుకున్నారు.
మాజీ ప్రధానులు ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ, వారి కుటుంబానికి సంబంధించిన అంశాలపై ఇన్నాళ్లూ కొందరు రాసిన అవాస్తవాలకు ఈ పుస్తకం చెక్ పెట్టిందని రేవంత్ అభిప్రాయపడ్డారు. అనంతరం కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతోనూ సీఎం రేవంత్ రెడ్డి కాసేపు మాట్లాడారు. ఆత్మకథలో రాహుల్‌కు సంబంధించిన అంశాలను చర్చించారు.
