‘ఆశా’లకు రూ.18 వేల జీతం ఇయ్యాలె : సీఐటీయూ నేత దశరథ్

‘ఆశా’లకు రూ.18 వేల జీతం ఇయ్యాలె :  సీఐటీయూ నేత దశరథ్
  •     డిసెంబర్ 15 నుంచి నిరవధిక సమ్మె
  •      సీఐటీయూ నేత దశరథ్

సైఫాబాద్, వెలుగు: ఆశా కార్యకర్తలకు నెలకు రూ.18 వేల ఫిక్సుడ్​ వేతనం చెల్లించడంతోపాటు పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యాలు కల్పించాలని సీఐటీయూ గ్రేటర్ హైదరాబాద్ సెంట్రల్ సిటీ కమిటీ అధ్యక్షుడు ఎం. దశరథ్ డిమాండ్ చేశారు. డిమాండ్లను పరిష్కరించకపోతే డిసెంబర్ 15 నుంచి రాష్ట్రవ్యాప్తంగా నిరవధిక సమ్మె చేపడతామని హెచ్చరించారు. 

డిమాండ్ల సాధనకు సోమవారం ఆశా కార్యకర్తలు హైదరాబాద్ కలెక్టరేట్ ఎదుట నిరసన తెలిపారు. దశరథ్ మాట్లాడుతూ ఎన్నో బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఆశా కార్యకర్తలకు నెలకు రూ.9,900 ఇస్తున్నారని, ఇది అన్యాయమన్నారు. రూ.18 వేల స్థిర వేతనం, బీమా, పదవీ విరమణ ప్రయోజనాలు కల్పిస్తామని ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని కోరారు. సీఐటీయూ గ్రేటర్ హైదరాబాద్ సెంట్రల్ జిల్లా కార్యదర్శి జె. కుమారస్వామి, మీనా, టి. యాదమ్మ, శరబాబు, సరస్వతి పాల్గొన్నారు.