- సబ్ జూనియర్, జూనియర్, సీనియర్ విభాగాల్లో పోటీలు
ఓయూ,వెలుగు: తెలంగాణ సైక్లింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అస్మిత ఖేలో ఇండియా సౌత్ జోన్ ఉమెన్స్ ట్రాక్ సైక్లింగ్ లీగ్ పోటీలు ఉస్మానియా యూనివర్సిటీలోని సైక్లింగ్ స్టేడియంలో ఉత్సాహంగా కొనసాగుతున్నాయి. సోమవారం ఐదు రాష్ట్రాలకు చెందిన సుమారు 240 మంది మహిళా క్రీడాకారిణులు సబ్ జూనియర్, జూనియర్, సీనియర్ విభాగాల్లో పోటీపడి ప్రతిభను చాటారు. మహిళా సైక్లింగ్ క్రీడకు ప్రోత్సాహం అందించడంతో పాటు జాతీయ స్థాయిలో రాణించే క్రీడాకారిణులను తయారు చేయడమే పోటీల లక్ష్యమని నిర్వాహకులు తెలిపారు.
కార్యక్రమానికి తెలంగాణ సైక్లింగ్ అసోసియేషన్ ప్రధాన అధ్యక్షుడు పి. మల్లారెడ్డి, రిటైర్డ్ డిప్యూటీ డైరెక్టర్ జి. చంద్రారెడ్డి, రాష్ట్ర కార్యదర్శి బి. విజయకాంతరావు, సైక్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అబ్జర్వర్ మాక్సివెల్ ట్రైవర్, సాట్స్ కోచ్లు భాస్కర్ రెడ్డి, పాండు జాదవ్, రైల్వే కోచ్ ధర్మతేజ , జిల్లా కార్యదర్శులు రమేష్, గోపాలం, పౌల్స్, నరేష్ పాల్గొన్నారు.
