- సోషల్ మీడియా ప్రచారం అవాస్తవం
- చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని వార్నింగ్
హైదరాబాద్, వెలుగు: సోషల్ మీడియాలో తనపై జరగుతున్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. కాంగ్రెస్ గెల్వదనే వ్యాఖ్యలపై ఆయన క్లారిటీ ఇచ్చారు. కరువు తర్వాత అధికార పార్టీ గెలిచిన చరిత్ర లేదంటూ చంద్రబాబు నాయుడితో తాను ప్రస్తావించినట్లు కొందరు కావాలనే ఫేక్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.
రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే తాను మాట్లాడని మాటలను తనకు ఆపాదిస్తున్నారని విమర్శించారు. ప్రజల్లో గందరగోళం సృష్టించేలా నిరాధార ప్రచారానికి పాల్పడుతున్న వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని తుమ్మల హెచ్చరించారు.
