ఓట్ చోర్.. గద్దీ ఛోడ్ వ్యాఖ్యలపై బీజేపీ ఆగ్రహం.. ఇటలీ నేత ఫిలిబెక్ను జైలుకు పంపాలని డిమాండ్

ఓట్ చోర్.. గద్దీ ఛోడ్ వ్యాఖ్యలపై బీజేపీ ఆగ్రహం.. ఇటలీ నేత  ఫిలిబెక్ను జైలుకు పంపాలని డిమాండ్
  • భారత్ సమిట్ నిర్వాహకులపై క్రిమినల్ కేసులు పెట్టాలె
  • ఎఫ్‌‌‌‌ఆర్‌‌‌‌ఆర్‌‌‌‌వో, డీజీపీకి ఫిర్యాదు చేసిన బీజేపీ స్టేట్ చీఫ్​
  • రాహుల్, రేవంత్ సారీ చెప్పాలన్న రామచందర్ రావు

 హైదరాబాద్, వెలుగు: భారత్ సమిట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో భారత ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసిన ఇటలీ నేత జియాకోమో ఫిలిబెక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో పాటు సదస్సు నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకోవాలని బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ ఎన్. రాం చందర్ రావు డిమాండ్ చేశారు. ఇమ్మిగ్రేషన్ చట్టాలు, వీసా నిబంధనల ఉల్లంఘనపై దర్యాప్తు జరపాలని కోరారు. సోమవారం ఆయన నేతృత్వంలోని బీజేపీ ప్రతినిధి బృందం శంషాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని ఫారినర్స్ రీజనల్ రిజిస్ట్రేషన్ ఆఫీస్(ఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వో)లో ఫిర్యాదు చేసి వినతిపత్రం సమర్పించింది. 

ఈ సందర్భంగా రాంచందర్ రావు మాట్లాడుతూ.. ప్రధాని మోదీపై కాంగ్రెస్ చేస్తున్న ‘ఓట్ చోర్.. గద్దీ ఛోడ్’ ప్రచారాన్ని ఇటలీకి చెందిన పార్టీ ఆఫ్ యూరోపియన్ సోషలిస్ట్స్ (పీఈఎస్) నేత జియాకోమో ఫిలిబెక్ భారత గడ్డపై పలకడం దారుణమన్నారు. వీసా నిబంధనల ప్రకారం విదేశీయులు ఇతర దేశాల అంతర్గత రాజకీయాల్లో, ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడకూడదన్నారు. భారత సార్వభౌమత్వాన్ని, ప్రజాస్వామ్యాన్ని అవమానిస్తూ విదేశీ నేత మాట్లాడుతుంటే వేదికపై ఉన్న రాహుల్ గాంధీ చప్పట్లు కొట్టడం, సీఎం రేవంత్ రెడ్డి నవ్వుతూ ప్రోత్సహించడం సరికాదన్నారు. ఈ వ్యవహారంపై రాహుల్, రేవంత్ బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

చట్టప్రకారం మూడేండ్ల జైలు..

ఇమ్మిగ్రేషన్ అండ్ ఫారినర్స్ యాక్ట్–2025 ప్రకారం దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే విదేశీయులకు మూడేళ్ల వరకు జైలు శిక్ష, రూ.3 లక్షల వరకు జరిమానా విధించవచ్చని రాంచందర్ రావు తెలిపారు. రూ.3 లక్షల జరిమానా రేవంత్ రెడ్డికి పెద్ద విషయం కాకపోవచ్చని, కానీ విదేశీ నేతకు చట్టప్రకారం మూడేళ్ల జైలు శిక్ష విధించాలని అన్నారు. ఫిలిబెక్ ఇంకా భారత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఉంటే బహిష్కరించాలని, భవిష్యత్తులో భారత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో అడుగుపెట్టకుండా బ్లాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లిస్ట్ చేయాలని కోరారు. పెట్టుబడుల సదస్సు పేరుతో భారత్ వ్యతిరేక సదస్సుగా మార్చిన నిర్వాహకులపై క్రిమినల్ కేసులు పెట్టి జైలుకు పంపాలని డిమాండ్ చేశారు. 

సదస్సుకు హాజరైన ప్రొఫెసర్ అపూర్వానంద్, సలీల్ శెట్టితో పాటు విదేశీ, స్వదేశీ ప్రతినిధుల నేపథ్యంపై విచారణ జరపాలని కోరారు. బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీరేందర్ గౌడ్, ఎన్వీ సుభాష్, శ్రీరాములు యాదవ్ తదితరులు ప్రతినిధులు బృందంలో ఉన్నారు. సోమవారం సాయంత్రం రాష్ట్ర డీజీపీకి కూడా ఫిర్యాదు చేశారు. వీసా నిబంధనలు ఉల్లంఘించిన జియాకోమోతో పాటు ప్రధాన ప్రేరేపకుడిగా ఉన్న రాహుల్ గాంధీపై కేసు పెట్టాలని కోరినట్లు రాంచందర్ రావు తెలిపారు.